Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యువతిని గర్భవతిని చేసి యువకుడు హైదరాబాద్ పరార్, ప్రియుడు ఆత్మహత్య యత్నం

Advertiesment
యువతిని గర్భవతిని చేసి యువకుడు హైదరాబాద్ పరార్, ప్రియుడు ఆత్మహత్య యత్నం
, సోమవారం, 19 అక్టోబరు 2020 (20:22 IST)
ఆ అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. ఆమే సర్యస్వం అనుకున్నాడు. కానీ ఆమె మాత్రం అతన్ని మోసం చేసింది. ప్రేమను అపహాస్యం చేసి వేరొక వ్యక్తికి దగ్గరైంది. శారీరకంగా కలవడమే కాదు. గర్భం దాల్చింది. చివరకు ఆ వ్యక్తి కనిపించకుండా పోతే తన గర్భానికి మొదటి ప్రేమికుడే కారణమని చెప్పి అతడు ఆత్మహత్యకు పాల్పడేలా చేసింది.
 
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన దినేష్, అర్చనలు ఇంటర్లో క్లాస్‌మేట్‌లు. ఒకే వీధిలో ఉండేవారు. ఇద్దరూ మంచి స్నేహితులు కావడంతో పాటు దినేష్ అర్చనను ప్రేమించాడు. ఆ విషయాన్ని అర్చనకు చెప్పాడు. అర్చన కోసం పార్ట్ టైం జాబ్‌లు చేస్తూ ఆమెకు కావాల్సింది కొనిచ్చేవాడు. 
 
అయితే వీరి ప్రేమ నడుస్తుండగానే హైదరాబాద్‌కు చెందిన రాజేష్ అనే యువకుడు దినేష్ ఉన్న వీధిలోకే వచ్చాడు. రాజేష్ అక్క అక్కడే ఉండటంతో అతను ఇక్కడకు వచ్చాడు. రాజేష్ అక్క ఇంటికి అర్చన వచ్చి పోతుండటంతో అతని కళ్ళు ఆమెపై పడ్డాయి.
 
మెల్లగా అర్చన నెంబర్ తీసుకున్నాడు. ఆమెను మాటల్లోకి దింపాడు. హైదరాబాద్‌లో తనకు ఆస్తులున్నాయని.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటానన్నాడు. దీంతో అర్చన రాజేష్‌కు బాగా దగ్గరైంది. దగ్గరవ్వడమంటే శారీరకంగా దగ్గరవ్వడం. ఇలా నెలన్నర పాటు వీరి మధ్య ఆ సంబంధం కొనసాగింది.
 
ఫలితంగా అర్చన గర్భవతి అయ్యింది. ఈ విషయం అతడికి చెప్పగానే, సరిగ్గా వారం రోజుల క్రితమే రాజేష్ హైదరాబాద్‌కు వెళ్ళి వస్తానన్నాడు. అంతే... వెళ్ళిన రాజేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అర్చన గర్భవతి అనే విషయం ఇంట్లో తెలిసిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు నిలదీశారు. 
 
కానీ అర్చన నోరు మెదపలేదు. ఐతే ఆమెతో దినేష్ తరచూ కలిసి ఉండటంతో అతడే కారణమని భావించారు. అర్చన కూడా రాజేష్ పేరు చెప్పకుండా మిన్నకుండిపోయింది. ఐతే ఆమె గర్భానికి తనకేమీ సంబంధం లేదని దినేష్ చెప్పాడు. కానీ ఆమె కుటుంబ సభ్యులు ఎంతకూ ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అపస్మారక స్థితిలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లుగా పేపర్ పైన రాసి పెట్టాడు దినేష్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీ ప‌ద్మావాసిని అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారు