Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వైసీపీలో చేరా: శైలజానాథ్

ఐవీఆర్
శనివారం, 8 ఫిబ్రవరి 2025 (09:27 IST)
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వైసీపీలో చేరానని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శైలజానాథ్ తెలియజేసారు. విజయ్ సాయిరెడ్డి షర్మిలను ఎందుకు కలిశారో తనకు తెలియదని చెప్పారు. భవిష్యత్తులో షర్మిల- జగన్ కలుస్తారో లేదో తను చెప్పలేననీ, కానీ రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చంటూ వెల్లడించారు. రాష్ట్రంలో మెడికల్ సీట్లు తమకు వద్దంటూ కూటమి ప్రభుత్వం లేఖ రాయడం ఏంటని ప్రశ్నించారు. 
 
కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం నాడు చేరారు. వైకాపా అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. శైలజానాథ్‌కు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. శైలజానాథ్ వైసీపీలో చేరిన సమయంలో ఆయనతో పాటు ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఇతర నేతలు ఉన్నారు. 
 
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నుంచి 2004, 2009లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా శైలజానాథ్ గెలుపొందారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పని చేశారు. 2022లో ఏపీసీసీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments