Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పార్టీలో చేరిన తర్వాత జగన్ రాజకీయ అత్యాచారం చేస్తారు : డొక్కా మాణిక్యవరప్రసాద్

Advertiesment
Dokka ManikyavaraPrasad

ఠాగూర్

, శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025 (16:36 IST)
ఏపీ మాజీ మంత్రి, ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరారు. ఈ చేరికపై మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ తన స్పందన తెలియజేశారు. పార్టీలో చేరిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ అత్యాచారం చేస్తారంటూ కామెంట్స్ చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఒక మిత్రుడుగా శైలజనాథ్‌కు ఓ సలహా ఇవ్వాలనుకుంటున్నానని, వైకాపాలో విలువలు, విశ్వసనీయతలు ఉండవని పార్టీలో చేర్చుకునే ముందు ఎంతో ఆప్యాయంగా ఉంటారని, చేరిన తర్వాత జగన్ రాజకీయ అత్యాచారం చేస్తారని తెలిపారు. 
 
వైకాపాలో ఇప్పటికే 74 మంది నేతలు ఎన్నో ఇబ్బందులుపడ్డారని డొక్కా అన్నారు. దళితులకు ఆ పార్టీలో విలువ ఉండదని చెప్పారు. దళితులకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ వైకాపా అని వ్యాఖ్యానించారు. శైలజానాథ్‌కు రాజకీయ భవిష్యత్ ఉండాలంటే ఆ పార్టీలో చేరకపోవడమే మంచిదని సూచించారు.
 
కాగా, శింగనమల వైకాపా ఇన్‌చార్జ్‌గా శైలజానాథ్ పేరును ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది. గత 30 యేళ్లుగా ఇదే సెంటిమెంట్ కొనసాగుతుండటం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతిలో బాహుబలి బ్రిడ్జి... ఇది ప్రారంభమైతే విజయవాడకు రానక్కర్లేదు..