Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే నేను...

Webdunia
బుధవారం, 16 మార్చి 2022 (21:56 IST)
ఇప్పుడు ఎక్కడ చూసినా మంత్రివర్గ విస్తరణ పైనే పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఎవరికి మంత్రి పదవి ఉంటుందో.. ఎవరికి మంత్రి పదవి పోతుందో తెలియని పరిస్థితి. అయితే ఆశావహులు మాత్రం విజయసాయిరెడ్డి నమ్మకంతోనే ఉన్నారు. మంత్రి పదవి వస్తుందన్న ధీమాలో ఉంటున్నారు.

 
ఇప్పటికే 26 జిల్లాలకు చెందిన నేతలకు మంత్రి పదవులు ఉంటాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేయాలన్నదే ఆలోచన అని స్పష్టం చేశారు. దీంతో మరింతమంది ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యే రోజాకు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా అవకాశం వచ్చిందని.. త్వరలోనే ఆమె పదవిని కూడా అలంకరించడం ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

 
ఇక చిత్తూరు జిల్లాకు చెందిన ప్రభుత్వ విప్‌గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా మంత్రుల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. విజయసాయి రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి స్వయంగా విజయసాయిరెడ్డే ఫోన్ చేసి మంత్రి పదవి ఖాయమైందని చెప్పినట్లు తెలుస్తోంది.

 
ఇక ఉన్నది రెండేళ్ళు మాత్రమే. ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేసి మంత్రిగా వెళ్లాలనే ఆలోచనలో చెవిరెడ్డి ఉన్నారట. చెవిరెడ్డికి మంత్రి పదవి వస్తుందని ఎప్పటినుంచో ఆయన అనుచరులు ఆశతో ఉన్నారు. మంత్రుల జాబితాలో చెవిరెడ్డి పేరు ఉందని తెలియడంతో ఎంతో సంతోషంగా ఉన్నారట ఆయన అనుచరులు. అయితే ఇప్పుడే ఈ విషయాన్ని చెప్పొద్దని.. చెవిరెడ్డి అనుచరులకు సూచించారట. మరి చూడాలి మంత్రివర్గంలో పదవులు ఎవరిని వరిస్తాయో... ఎవరిని ఊసూరుమనిపిస్తాయో..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments