ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పారంటూ నటుడు అలీ పేర్కొన్నారు. తనకు కెఎల్ యూనివర్శిటీ డాక్టరేట్ ప్రదానం చేసిన సందర్భంగా పలు విషయాలు మాట్లాడారు. తనకు డాక్టరేట్ ప్రదానం చేసిన వర్శిటీకి ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం మాట్లాడుతూ... డాక్టరేట్ వచ్చినందుకు చాలా సంతోషంగా వుందన్నారు. అలాగే మంత్రి పదవి కూడా వస్తే ఇంకా ఎంతో సంతోషిస్తానన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు. ఆయన పిలుపు కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
ఏపీలో సీఎం జగన్ పరిపాలన అద్భుతంగా వుందనీ, ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారంటూ కితాబిచ్చారు.