Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్న తండ్రి చేయాల్సిన పని కట్టుకున్న భార్య చేసింది...

Webdunia
మంగళవారం, 29 అక్టోబరు 2019 (15:58 IST)
తలకొరివి పెట్టాల్సిన కొడుకే కట్టెలపై కళ్లముందు శవమై ఉన్నా కనీసం లేవలేని దుస్థితి ఆ తండ్రిది. కడుపున పుట్టిన బిడ్డలు ఉన్నా... తలకొరివి పెట్టే వయసు వారికి లేదు. దీంతో జీవితాంతం తోడుగా ఉంటానని చేతిలో చెయ్యేసి బాసచేసి అర్ధాంతరంగా తనను విడిచి వెళ్లిపోయిన భర్త చితికి ఆ ఇల్లాలు అంత్యక్రియలు నిర్వహించింది. 
 
ఓ వైపు తండ్రి ... మరోవైపు వారసులు పోషించాల్సిన పాత్రను అన్నీ తానై భర్త చితికి నిప్పుపెట్టింది. సిక్కోలు జిల్లా మర్లపాడులో చోటుచేసుకుందీ హృదయ విదారకరమైన ఘటన. 
దేశరక్షణలో సేవలందిస్తూ... ప్రాణాంతక వ్యాధితో పోరాడి తుదిశ్వాస విడిచిన సిక్కోలుకు చెందిన జవాన్ బతకల దానయ్య అంతిమయాత్ర విషాదంగా మారింది. 
 
నందిగాం మండలం మర్లపాడు గ్రామానికి చెందిన బతకల దానయ్య, పంజాబ్ రాష్ట్రం అబోహర్లో హవాలాదార్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఐతే కొద్ది నెలల క్రితం ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడటంతో మూడు నెలలుగా కోల్‌కతా ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల (ఆదివారం) క్రితం మరణించాడు. మృతదేహాన్ని సోమవారం స్వగ్రామం మర్లపాడుకు తీసుకువచ్చిన అనంతరం భారీగా ఊరేగింపుగా అంతిమయాత్ర నిర్వహించారు. 
 
ఎప్పుడూ అందరితో సరదాగా ఉండే దానయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున అంతిమయాత్రలో పాల్గొన్నారు. దానయ్య మృతదేహంపై జాతీయజెండాను కప్పి గౌరవ సూచికంగా నేవీ , ఆర్మీ సిబ్బంది మూడుసార్లు గాలిలో కాల్పులు జరిపి వీడ్కోలు పలికారు. ఐతే దానయ్య తండ్రి అనారోగ్యంతో మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఉన్నారు. దానయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నా వారు చిన్నపిల్లలు కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వివాహబంధంతో ఏడడుగులు వేసిన దానయ్య భార్య శారద... తన భర్త చితికి నిప్పంటించి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన స్థానికంగా హృదయవిధారకంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments