Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోడిగుడ్లు తెచ్చివ్వలేదని ప్రియుడుతో వివాహిత జంప్

Advertiesment
కోడిగుడ్లు తెచ్చివ్వలేదని ప్రియుడుతో వివాహిత జంప్
, ఆదివారం, 27 అక్టోబరు 2019 (14:01 IST)
ప్రతి రోజూ ఆహారంలోకి కోడిగుడ్లు తెచ్చివ్వాలని ఆ భార్య కోరింది. కానీ, తన వద్ద డబ్బులు లేవనీ, ప్రతి రోజూ తెచ్చి ఇచ్చే స్థోమత అంతకంటే లేదనీ భర్త చెప్పాడు. అంతే... తనకు రోజూ కోడిగుడ్లు తెచ్చిపెడుతున్న ప్రియుడుతో లేచిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ జిల్లా కంపేర్‌గంజ్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కంపేర్‌గంజ్‌ ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు కూలీపనులు చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. అయితే, ప్రతి రోజూ తనకు ఇష్టమైన కోడిగుడ్లు ఉండాల్సిందేనని భార్య పట్టుబట్టింది. 
 
అందుకు కూలీ డబ్బులు సరిపోకపోవడంతో ఆ భర్త తన భార్య కోరికను నెరవేర్చడం లేదు. దీంతో నిన్న ఆమె భర్తతో గొడవపడి ప్రియుడితో పారిపోయింది. ఆ భర్త ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ తన బాధను చెప్పుకున్నాడు. 
 
తానో దినసరి కూలీనని, ఈ బలహీనతతో తన భార్య తనతో ఆడుకుందని వాపోయాడు. ఆమె ప్రియుడు ప్రతి రోజు గుడ్లు తెచ్చి ఇచ్చేవాడని చెప్పాడు. అందుకే అతడితో ఆమె పారిపోయిందని చెప్పాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశమంతా గర్వపడేలా అయోధ్య తీర్పు ఉంటుంది.. హ్యపీ దీపావళి : ప్రధాని మోడీ