Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన ఏడు రోజులకే విడిపోయారు.. భార్య చెప్పుతో కొట్టింది.. భర్త ఏం చేశాడంటే?

పెళ్లైన ఏడు రోజులకే విడిపోయారు. అయినా భార్యను వదిలి వుండలేక.. ఆమె వద్దకు వెళ్లి వస్తుండేవాడు భర్త. కానీ పెళ్లైన ఏడు రోజులకే విడిపోయినా.. తరచూ ఇంటికి వచ్చి వెళ్తున్న భర్త వేధింపులు తాళలేక సదరు మహిళ దుర

Webdunia
శుక్రవారం, 22 జూన్ 2018 (14:18 IST)
పెళ్లైన ఏడు రోజులకే విడిపోయారు. అయినా భార్యను వదిలి వుండలేక.. ఆమె వద్దకు వెళ్లి వస్తుండేవాడు భర్త. కానీ పెళ్లైన ఏడు రోజులకే విడిపోయినా.. తరచూ ఇంటికి వచ్చి వెళ్తున్న భర్త వేధింపులు తాళలేక సదరు మహిళ దురుసుగా ప్రవర్తించింది. కట్టుకున్న భర్తని కనికరం లేకుండా చెప్పుతోనే కొట్టింది. దీంతో తీవ్ర వేదనకు గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా, మండల కేంద్రమైన చాట్రాయి గ్రామానికి చెందిన చుండూరు కిషోర్ (22) అదే మండలంలోని సి.గుడిపాడు గ్రామానికి చెందిన శ్యామలను పెళ్లాడాడు. పెళ్లైన ఏడు రోజులకే వీరి విడిపోయారు. కానీ కిషోర్ తనను వేధిస్తున్నాడంటూ ఈనెల 19న స్థానిక పోలీస్ స్టేషన్‌లో శ్యామల ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో, కిషోర్‌కు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. 
 
ఈ సందర్భంగా ఆమె జోలికి వెళ్లనని కిషోర్ హామీ పత్రం రాసిచ్చాడు. ఆ మరుసటి రోజు ఇద్దరినీ పోలీసులు స్టేషన్‌కు రప్పించి మాట్లాడుతుండగానే శ్యామల కిషోర్‌ను చెప్పుతో కొట్టి దురుసుగా ప్రవర్తించింది.  దీంతో, అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గురువారం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల ముందు శ్యామల తనను చెప్పుతో కొట్టడాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ సైసూడ్ నోట్ కూడా రాశాడు. 
 
మరోవైపు, కిషోర్ చావుకు కారణమైన వారిని శిక్షించాలంటూ అతని బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నా చేశారు. శ్యామలతో పాటు ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేయాలంటూ, కిషోర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouni Roy: విశ్వంభరలో పాట కోసం రూ.45 లక్షలు తీసుకున్న మౌని రాయ్

Mahavatar Narasimha: మహావతార్ నరసింహను పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటా.. అల్లు అరవింద్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments