Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియురాలితో కానిస్టేబుల్ రాసలీలలు... రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న స్థానికులు

ఓ బీట్ కానిస్టేబుల్ ఠాణా రిజిస్టర్‌లో సంతకం చేసి ప్రియురాలితో రాసలీలలు కొనసాగిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. ఆ తర్వాత సహచర పోలీసుల సహాయంతో పలాయనం చిత్తగించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పర

Advertiesment
ప్రియురాలితో కానిస్టేబుల్ రాసలీలలు... రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న స్థానికులు
, గురువారం, 21 జూన్ 2018 (20:38 IST)
ఓ బీట్ కానిస్టేబుల్ ఠాణా రిజిస్టర్‌లో సంతకం చేసి ప్రియురాలితో రాసలీలలు కొనసాగిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. ఆ తర్వాత సహచర పోలీసుల సహాయంతో పలాయనం చిత్తగించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే....
 
కర్నూలు సబ్‌‌డివిజన్‌ పరిధిలోని ఓ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ బుధవారం ఉదయం స్టేషన్‌లో సంతకం చేసి బీట్‌ కోసం వెళ్లాడు. స్థానిక రాజీవ్‌ గృహకల్పకు ఓ మహిళతో చేరుకొని తన ఇంట్లో రాసలీలలు మొదలు పెట్టాడు.
 
ఈ విషయాన్ని స్థానికులు గుర్తించి... కానిస్టేబుల్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేసి ఇంట్లో పెట్టి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకోవడంతో ఆ బీట్ కానిస్టేబుల్ చాకచక్యంగా తప్పించుకుని పారిపోయాడు. 
 
ఈయనగారు.. గతంలో కూడా పలువురు మహిళలతో ఇక్కడకు వచ్చేవాడని, ఓ సారి ఇళ్లు శుభ్రం చేయడానికి, మరోసారి పనిమనిషి అని ఇలా చెప్పి తప్పించుకునేవాడని స్థానికులు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వార్డులో చికిత్స పొందుతున్న రోగి.. చనిపోయాడంటూ మృతదేహం అప్పగింత