Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ముఖ్యమంత్రి పీఠం ఆయనదే.. తేల్చిన ఇండియా టుడే సర్వే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే 2019లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఇప్పటి నుంచి అధికార టీడీపీ, విపక్ష వైకాపాలు కసరత్తులు చేస్తున్నాయి. ఒకవైపు జగన్ పాదయాత్ర చేస్తుంటే ఇంకోవైపు ఏపీ ముఖ్య

Webdunia
సోమవారం, 17 సెప్టెంబరు 2018 (10:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే 2019లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఇప్పటి నుంచి అధికార టీడీపీ, విపక్ష వైకాపాలు కసరత్తులు చేస్తున్నాయి. ఒకవైపు జగన్ పాదయాత్ర చేస్తుంటే ఇంకోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కార్యక్రమాల పేరుతో నిరంతరం ప్రజల చెంతే ఉంటున్నారు.
 
ఈనేపథ్యంలో ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా ఓ సర్వే నిర్వహించింది. ఏపీ ప్రజలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పట్టం కట్టనున్నట్లు తేలింది. చంద్రబాబుతో పోల్చుకుంటే జగన్‌కే ప్రజామద్దతు ఎక్కువగా ఉందని ఈ సర్వే స్పష్టంచేసింది.
 
ఆంధ్రప్రదేశ్ తదుపరి సీఎం ఎవరు? అని అడిగిన ప్రశ్నకు 43 శాతం మంది వైఎస్ జగన్‌కు ఓటేయగా, మరో 38 శాతం మంది సీఎం చంద్రబాబుకు మద్దతు తెలిపారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు 5 శాతం మంది ఓటేశారు. 
 
ఈ నెల 8 నుంచి 12 వరకూ రాష్ట్రవ్యాప్తంగా 10,650 మంది అభిప్రాయాలను సేకరించి ఈ సర్వేకు తుదిరూపు ఇచ్చారు. ఈ సర్వేలో చంద్రబాబు ప్రభుత్వం పనితీరు బాగుందని 33 శాతం మంది చెప్పగా, బాగోలేదని 36 శాతం మంది స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతుందా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాపెంత?

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments