Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబుకు నోటీసులు.. టెన్షన్ పడక్కర్లేదు.. ఉండవల్లి క్లారిటీ

మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులు జారీ చేయ‌డం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు, ఆయనతో పాటు మరో 14 మందిని ఈ నెల 21న విచారణకు హాజరు

చంద్రబాబుకు నోటీసులు.. టెన్షన్ పడక్కర్లేదు.. ఉండవల్లి క్లారిటీ
, ఆదివారం, 16 సెప్టెంబరు 2018 (09:51 IST)
మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులు జారీ చేయ‌డం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు, ఆయనతో పాటు మరో 14 మందిని ఈ నెల 21న విచారణకు హాజరు పరచాలని ఆదేశించింది.


ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారింది. ఎప్పుడో 2010లో జరిగిన ఘటనకు ఇప్పుడు నోటీసులు జారీ చేయడం వెనుక కేంద్ర ప్ర‌భుత్వ హ‌స్తం ఉంద‌ని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. 
 
2010 జూలై 16వ తేదీన బాబ్లీ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన నాటి ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు సహా ఇతర టీడీపీ ప్రజాప్రతినిదులను అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది. నిషేధం ఉన్నప్పటికీ కూడా బాబు సహా టీడీపీ ప్రజా ప్రతినిధులు బాబ్లీని సందర్శించారని ఆరోపిస్తూ ఆనాటి మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది.

అనంతరం వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే ఈ విషయంపై చంద్రబాబు సరిగా స్పందించలేదన్న కారణంగా ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ నోటీసులు జారీచేసింది. 
 
ఇక ఈ విషయమై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ మాట్లాడుతూ.. కోర్టుకు హాజరు కావాలని పలుమార్లు చంద్రబాబుకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కానీ అయన హాజరు కాలేదు అందుకే నాన్ బెయిలబుల్ నోటీసులు వచ్చాయి. ఇందులో అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదన్నారు. ఒక్కసారి కోర్టుకు బాబు హాజరైతే అంతా సరిపోతుందని ఉండవల్లి క్లారిటీ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిర్యాలగూడ పరువు హత్య.. పోలీసులు ఏమన్నారో తెలుసా?