Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిత్తూరు మామిడి తోటలో వ్యక్తి హత్య.. అవయవాలపై దారుణంగా?

చిత్తూరులోని మామిడి తోటలో గురువారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మొగిలిరెడ్డి తలపై, ఇతర శరీర అవయవాలపై దారుణంగా కొట్టారు. ఆ తర్వాత గుడ్డతో గొంతు బి

Advertiesment
chittor
, శనివారం, 15 సెప్టెంబరు 2018 (13:05 IST)
చిత్తూరులోని మామిడి తోటలో గురువారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మొగిలిరెడ్డి తలపై, ఇతర శరీర అవయవాలపై దారుణంగా కొట్టారు. ఆ తర్వాత గుడ్డతో గొంతు బిగించి చంపేశారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా, తవణంపల్లె మండలంలోని వెంగంపల్లె సమీపంలోని మామిడి తోటలో వెంగంపల్లెకు చెందిన మొగిలిరెడ్డి(45) హత్యకు గురయ్యాడు. 
 
మొగిలిరెడ్డి వ్యవసాయంతో పాటు మామిడి కాయలు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి వెంగంపల్లె సమీపంలో మామిడి తోట ఉంది. పాడి ఆవు ఈనుతుందని మొగిలిరెడ్డి, అతని భార్య మమత గురువారం రాత్రి 9 గంటల తంలో మామిడి తోట వద్దకు వెళ్లారు. అక్కడే నిద్రించారు. శుక్రవారం ఉదయం కొడుకు రోహిత్‌రెడ్డి మామిడి తోట వద్దకు వెళ్లి చూడగా తండ్రి మంచంపై ప్రాణాలు కోల్పోయి కనిపించాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 
 
డీఎస్పీ సుబ్బారావు నేతృత్వంలో మొగిలిరెడ్డి భార్య మమత, కూతురు భార్గవి, కుమారుడు రోహిత్‌ రెడ్డి, గ్రామస్తులను వేర్వేరుగా విచారించారు. తాను మంచం పక్కనే పడుకున్నానని, చీకటిలో భర్తపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని, దాంతో భయపడి పారిపోయానని భార్య పోలీసులకు తెలిపింది. పోలీసులు మాత్రం హత్యకు భార్య వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీరో నుంచి హీరో... మొబైల్స్ తయారీలో నెంబర్ వన్ ఏపీ...