Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను గర్భవతిని చేసిన టీచర్.. చితక్కొట్టి నగ్నంగా ఊరేగింపు

విద్యాబుద్ధులు చెప్పాల్సిన బడిపంతుళ్లే కామాంధులుగా మారిపోతున్నారు. ఫలితంగా పాఠశాలకు వెళ్లే బాలికలకు కూడా రక్షణ లేకుండా పోతోంది. తాజాగా ఓ ఉపాధ్యాయుడు మంచి మార్కులు వేయిస్తానని చెప్పి ఓ బాలికను గర్భవతి

Webdunia
బుధవారం, 22 ఆగస్టు 2018 (10:35 IST)
విద్యాబుద్ధులు చెప్పాల్సిన బడిపంతుళ్లే కామాంధులుగా మారిపోతున్నారు. ఫలితంగా పాఠశాలకు వెళ్లే బాలికలకు కూడా రక్షణ లేకుండా పోతోంది. తాజాగా ఓ ఉపాధ్యాయుడు మంచి మార్కులు వేయిస్తానని చెప్పి ఓ బాలికను గర్భవతి చేశాడు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆ బాలిక బంధువులతో పాటు.. స్థానికులు కలిసి టీచర్‌కు దేహశుద్ధి చేసి నగ్నంగా ఊరేగించారు.
 
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు టూటౌన్‌ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఓ బాలిక పదో తరగతి వరకు చదువుకుంది. ఆ సమయంలో ఇదే స్కూల్‌లో లెక్కలు, ఇంగ్లీషు పాఠాలను కారె రాంబాబు అనే టీచర్ బోధిస్తూ వచ్చాడు. ఆ సమయంలో ఆ బాలికకు మార్కులు బాగా వేయిస్తానని నమ్మబలికి బాలికను లోబరుచుకున్నాడు. ఆ తర్వాత తన గదికి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేస్తూ వచ్చాడు. 
 
ప్రస్తుతం ఆ బాలిక పదో తరగతి పూర్తి చేసి.. స్థానికంగా ఉండే ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో విద్యాభ్యాసం చేస్తోంది. అయినప్పటికీ ఆ బాలికను వదలిపెట్టని ఆ కామాంధుడు.. బాలికను తన గదికి పిలిపించుకుని కామ కోర్కెలు తీర్చుకుంటూ వచ్చాడు. ఇంట్లో తెలిస్తే, తననే కోప్పాడతారనే భయంతో, ఆమె ఆ విషయం బయటకు చెప్పలేదు. 
 
అయితే తమ కుమార్తె గర్భం దాల్చినట్టు కుటుంబసభ్యులు ఇటీవల గుర్తించారు. అప్పటికే ఆమె ఐదు నెలల గర్భం ధరించింది. దీనిపై ఆగ్రహించిన కుటుంబసభ్యులు.. మంగళవారం రాంబాబు గదిలోకి చొరబడి, బయటకు ఈడ్చుకొచ్చారు. ఒంటి మీద బట్టలు ఊడదీసి.. రోడ్డు మీద పడేసి కొట్టారు. విషయం తెలుసుకొన్న పోలీసులు, అక్కడకు చేరుకొని వారిని చెదరగొట్టారు. తీవ్రంగా గాయపడిన రాంబాబును ఆస్పత్రికి తరలించారు.  
 
కాగా, రాంబాబు స్వస్థలం కర్నూలు జిల్లా. అతనికి పదేళ్ళ క్రితమే వివాహమైంది. భార్య రాంబాబును వదిలివేయటంతో ఏలూరులోనే గత 7 సంవత్సరాలుగా ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. బాలికను మోసం చేసి లోబరుచుకుని గర్భవతిని చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం