Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను తాతయ్యను కాదు.. మీ మామయ్యను... బాలికలతో పాస్టర్ రాసలీలలు

ఓ పాస్టర్ రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. 76 యేళ్లున్న పాస్టర్ తనకు మనుమరాళ్ల వయసున్న బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేనా.. అర్థరాత్రివరకూ అశ్లీల చిత్రాలు చూపించి అదేవిధంగా చేయాలంటూ వేధించాడు.

Advertiesment
నేను తాతయ్యను కాదు.. మీ మామయ్యను... బాలికలతో పాస్టర్ రాసలీలలు
, ఆదివారం, 19 ఆగస్టు 2018 (15:29 IST)
ఓ పాస్టర్ రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. 76 యేళ్లున్న పాస్టర్ తనకు మనుమరాళ్ల వయసున్న బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేనా.. అర్థరాత్రివరకూ అశ్లీల చిత్రాలు చూపించి అదేవిధంగా చేయాలంటూ వేధించాడు. ఇలా లైంగిక వేధింపులు ఎదుర్కొన్న బాలికల్లో 8 యేళ్ళ నుంచి 16 యేళ్ల బాలికల వరకు ఉన్నారు. లైంగిక వేధింపుల సమయంలో బాలికలతో నేను మీకు పాస్టర్ తాతయ్యను కాదు.. మీ మామయ్యను అంటూ చెప్పి వికృత చేష్టలకు పాల్పడేవాడు.
 
జిల్లా కేంద్రమైన ఒంగోలు పట్టణంలోని స్థానిక క్లౌపేటలో యూసీఎల్‌ఐ పాఠశాలకు అనుబంధంగా ఉండే హోంలో 53 మంది బాలికలు ఉన్నారు. వీరికి 76 యేళ్ల జోసెఫ్ అనే వ్యక్తి పాస్టర్‌గా ఉంటున్నాడు. ఆ పాఠశాలలో బాలల సంరక్షణ కమిటీ అధికారులు ఇటీవల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 
 
ఆ సమయంలో ఏవేని సమస్యలు ఉంటే తెల్లకాగితంపై రాసివ్వాలని బాలికలను అధికారులు కోరారు. దీంతో పలువురు విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న వేధింపులను స్పష్టంగా రాసిచ్చారు. బయటకు చెప్పుకునేందుకు సిగ్గుపడే విధంగా 76 ఏళ్ల జోసఫ్‌ పాస్టర్‌ తమకు అశ్లీల చిత్రాలు చూపిస్తూ లైంగికంగా వేధిస్తున్నారంటూ పలువురు బాలికలు చెప్పడంతో అధికారులు నిర్ఘాంతపోయారు. 
 
అర్థరాత్రి వరకు పాస్టర్‌ జోసఫ్‌ ఆయనతో పాటు ఉండాలని ఆదేశిస్తారని, ఈ క్రమంలో తమకు అశ్లీల వీడియోలు చూపించి అలా చేయాలంటూ తమను వేధిస్తున్నాడంటూ భోరుమన్నారు. అంతేకాకుండా తమను తాకరాని చోట తాకుతూ శారీరకంగా కూడా వేధిస్తున్నారంటూ కన్నీటిపర్యంతమయ్యారు. 
 
దీంతో పక్కా ప్రణాళికతో బాలికలందరినీ సమీపంలోని బాలసదన్‌కు అధికారులు తరలించారు. ఆ తర్వాత ఒంగోలు రెండో పట్టణ పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు... పాస్టర్ జోసెఫ్‌ను అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తకు సెలవు దొరకలేదనీ ఉరేసుకున్న భార్య.. ఎక్కడ?