Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధర్మపురి సంజయ్ అరెస్ట్, లైంగిక వేధింపుల కేసులో...

లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న డి. శ్రీనివాస్ తనయుడు నిజామాబాద్ మాజీ మేయర్ డి. సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఏసీపీ కార్యాలయానికి వచ్చిన సంజయ్‌ను మూడు గంటల పాటు విచారించి అనంతరం అరెస్ట్ చేసారు. సంజయ్‌ను జిల్లా ప్రభుత

Advertiesment
ధర్మపురి సంజయ్ అరెస్ట్, లైంగిక వేధింపుల కేసులో...
, సోమవారం, 13 ఆగస్టు 2018 (14:50 IST)
లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న డి. శ్రీనివాస్ తనయుడు నిజామాబాద్ మాజీ మేయర్ డి. సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఏసీపీ కార్యాలయానికి వచ్చిన సంజయ్‌ను మూడు గంటల పాటు విచారించి అనంతరం అరెస్ట్ చేసారు. సంజయ్‌ను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు పూర్తయిన వెంటనే మొదటి అదనపు జడ్జి ఎదుట హాజరుపరిచారు పొలీసులు. 
 
సంజయ్ తరపు న్యాయవాదులు మూడుగంటల పాటు జడ్జి ఎదుట వాదనలు వినిపించారు. స్టేషన్ బెయిల్ ఇవ్వాలని సంజయ్ తరపు న్యాయవాదులు కోరారు. అయితే సంజయ్ పైన ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు పోలీసులు అడిషనల్‌గా జత చేయడంతో ఇది తన పరిధిలోనిది కాదని ఎస్సి,ఎస్టీ స్పెషల్ కోర్టులో హాజరు పరచాలని పోలీసులకు మొదటి అదనపు న్యాయమూర్తి సూచించారు.
 
వెంటనే ఎస్సి, ఎస్టీ స్పెషల్ కోర్ట్ ఇంచార్జ్ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు పొలీసులు. అయితే సంజయ్ తరపు న్యాయవాదులు చేసిన వాదనలను ఏకిభవిoచని న్యాయమూర్తి సంజయ్‌ను 24వ తేదీ వరకు జ్యూడిషల్ రిమాండ్‌ను విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రాత్రి 11 గంటలకు సంజయ్‌ను సారంగపూర్ జైలుకు తరలించారు. సోమవారం లేదా మంగళవారం సంజయ్‌ను పొలీసులు కస్టడీకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరుణ ఇంట అప్పుడే లొల్లి.. పార్టీ క్యాడర్ అంతా అళగిరి వైపేనట..