Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరంగల్ న్యూస్.. ఆ యువతిని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి, అత్యాచారం చేశారా?

Webdunia
గురువారం, 28 నవంబరు 2019 (13:04 IST)
హన్మకొండ రూరల్‌: నవంబర్‌ 27: హన్మకొండలో దారుణం జరిగింది. పుట్టిన రోజే తన జీవితంలో చివరి రోజు అయింది.. దేవుడి దగ్గరకు వెళుతున్నానని చెప్పిన ఆ యువతి ఇక తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయింది.. 19 ఏళ్ళ యువతిని గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. 
 
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం దీనదయాళ్‌నగర్‌లో ఈ యువతి తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. బుధవారం పుట్టిన రోజు కావడంతో గుడికి వెళుతున్నానని చెప్పి, యువతి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది.
 
 చాలాసేపటి వరకు కూడా ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ వచ్చింది. కంగారు పడిన కుటుంబ సభ్యులు, బంధువులు చాలా చోట్ల వెతికారు. అయినప్పటికీ జాడ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
రాత్రి 10 గంటల సమయంలో హంటర్‌రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్స్‌ సమీపంలో ఓ యువతి మృతదేహం ఉందని సమాచారం అందింది. కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని విగతజీవిగా పడి ఉన్న తన కూతురును చూసి గుండెలవిసేలా ఏడ్చారు.. పుట్టిన రోజే .. నీకు ఆఖరి రోజైందా బిడ్డా అంటూ రోదించారు. యువతి శవం పడి ఉన్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. శరీరంపై పెద్దగా గాయాలు లేవు.   
 
కాగా మర్మాంగం నుంచి మాత్రం తీవ్ర రక్త స్రావం జరిగినట్లు గుర్తించారు. దీంతో సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కొద్ది దూరంలో బీరు సీసాలు, అమ్మాయి చెప్పులు లభించాయి. ఆ ప్రాంతం పూర్తిగా నిర్మానుష్యంగా ఉంటుంది. 
 
ఖాళీ ప్రదేశం ఎక్కువ. వీధి దీపాలు లేక పోవడంతో చీకటిగా ఉంటుంది. యువతిని కిడ్నాప్‌ చేసి, నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి, అత్యాచారం చేశారా? ఇది ఆమెకు తెలిసిన వారి పనేనా? గుట్టు బయటపడకుండా ఉండేందుకు హత్య చేసి ఉంటారా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Radhika Apte: రాధికా ఆప్టేకు ఆడబిడ్డ పుట్టి వారం రోజులైందట!

Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్.. పూనమ్ కౌర్ కామెంట్స్.. రాజకీయం అంటే?

విల్ స్మిత్‌తో $50 మిలియన్ మీడియా ఫండ్ కోసం విష్ణు మంచు చర్చలు

గేమ్ ఛేంజర్ లో దర్శకుడు శంకర్ పాత్ర చెప్పగానే వద్దకున్నా: శ్రీకాంత్

అల్లు అర్జున్ కలిసిన ఉపేంద్ర.. మంచి మనిషి అని కితాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments