Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టినరోజు.. యువతిపై సామూహిక అత్యాచారం.. శరీరంపై గాయాలు లేవు కానీ..?

Webdunia
గురువారం, 28 నవంబరు 2019 (12:32 IST)
పుట్టినరోజున ఓ యువతిపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హన్మకొండలోని దీనదయాళ్‌నగర్‌కి చెందిన 19 ఏళ్ల యువతి బుధవారం ఉదయం గుడికి బయలుదేరింది. 
 
పుట్టినరోజు కావడంతో గుడిలో దేవున్ని దర్శించుకుని వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లింది. అలా వెళ్లిన యువతి.. రాత్రైనా ఇంటికి తిరిగిరాలేదు. ఫోన్ చేస్తే స్విచాఫ్. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చాలాచోట్ల వెతికినప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఇదే క్రమంలో రాత్రి పది గంటలకు హంటర్‌రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్స్ సమీపంలో ఓ యువతి మృతదేహం పడివున్నట్టుగా సమాచారం అందింది. ఆమె కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకునేసరికి.. ఆ యువతి విగతజీవిగా అక్కడ పడిపోయి ఉంది.

బిడ్డను అలా చూసి తట్టుకోలేకపోయిన తల్లిదండ్రులు రోదించారు. పుట్టినరోజే చివరి రోజైందా అంటూ విలపించారు. పోలీసులు యువతి మృతదేహాన్ని పరిశీలించగా.. శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. కానీ మర్మాంగం నుంచి తీవ్ర రక్తస్రావం జరిగినట్టు గుర్తించారు. 
 
యువతి మృతదేహం వున్న ప్రాంతం నిర్మానుష్యంగా ఉండటం.. పక్కనే బీర్ సీసాలు ఉండటంతో.. ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగినట్టుగా అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం