Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెపోటుతో బాలింత మృతి.. స్తన్యమిచ్చి పడుకుంది.. అంతే..

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2023 (09:44 IST)
గుండెపోటుతో మృతి చెందే వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో అధికమవుతోంది. తాజాగా ఓ బాలింత గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. వరంగల్  సీకేఎం ప్రభుత్వాసుపత్రిలో ఘోరం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే, వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామానికి చెందిన సుస్మిత(25) ప్రసవం కోసం ఈ నెల 13న సీకేఎం ఆసుపత్రిలో చేరింది. 16న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 
 
అయితే శిశువుకు అనారోగ్య సమస్యలు రావడంతో వైద్యులు ఆస్పత్రిలోనే నవజాత శిశుసంరక్షణ కేంద్రంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎప్పటిలాగే తన బిడ్డకు ప్రత్యేక వార్డులో స్తన్యమిచ్చి వచ్చి తన బెడ్‌పై పడుకుంది. కానీ, ఉదయం చాలాసేపైనా ఆమె చలనం లేకుండా పడుకుని ఉండటంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. సుస్మితను నిద్రలేపేందుకు ప్రయత్నించగా ఆమెలో కదలికలు కనిపించలేదు.  
 
విషయం తెలిసి ఆమెను పరీక్షించిన వైద్యులు సుస్మితకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించినట్లు ధ్రువీకరించారు. ఆమెకు సీపీఆర్ చేసిన ఫలితం లేకపోయింది. సుస్మిత మరణంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నవజాత శిశువును చూస్తూ.. తల్లిని లేని బిడ్డగా మారిపోయావంటూ వారి రోదనలు ఆస్పత్రిలోని వారంతటిని కలిచివేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments