Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాగల 24 గంటల్లో హైదరాబాద్‌లో అతి భారీ వర్షాలు

rain
, సోమవారం, 17 జులై 2023 (13:23 IST)
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నెలకొనివుంది. దీని ప్రభావం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. వచ్చే 24 గంటల్లో హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 
 
ఇప్పటికే సోమవారం ఉదయం నుంచి హైదరాబాద్ నగరంపై ముసురు అలుముకుంది. క్రమంగా చిరు జల్లులు నుంచి మోస్తరు వాన కురుస్తుంది. మరికొన్ని గంటల్లో ఇది భారీ వర్షంగా మారొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది.
 
మరోవైపు, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి నెలకొంటుందని అంచనా వేసింది. కొమరం భీమ్, అసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, నిజామాబాద్, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
డివైడర్‌పై నుంచి దూసుకొచ్చిన లారీ... 
 
హైదరాబాద్ నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శామీర్‌పేట - కీసర మధ్యలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం గురించి స్థానిక పోలీసులతో స్థానికులు వెల్లడించిన వివరాల మేరకు..
 
ఔటర్‌ రింగ్‌ రోడ్డులో ఘట్‌కేసర్‌ నుంచి మేడ్చల్‌ వైపు వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి డివైడర్‌ పైనుంచి దూసుకొచ్చింది. ఇది నేరుగా డివైడర్‌ను దాటుకుని వచ్చి ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం, కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ సహా బొలెరో వాహనంలోని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
నన్ను నమ్మండి.. నా కల నిజమైంది : నిధి అగర్వాల్ 
 
వెండితెరపై హల్చల్ చేస్తున్న కుర్రకారు హీరోయిన్ నిధి అగర్వాల్. ఆమెకు అతి తక్కువ కాలంలో లక్కీఛాన్స్ వరించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో నటించే అదృష్టాన్ని దక్కించుకుంది. "హరిహర వీరమల్లు" చిత్రంలో ఆమె నటించారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం తాజా సమాచారాన్ని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం అది వైరలవుతుండగా.. నెటిజన్లు నిధికి థ్యాంక్స్‌ చెబుతూ కామెంట్స్‌ పెడుతున్నారు.
 
తాజాగా పవన్‌ కల్యాణ్‌ తన ఇన్‌స్టాలో తొలి పోస్ట్‌ చేశారు. సినీ రంగానికి చెందిన వారితో ఆయన ఇప్పటివరకు దిగిన ఫొటోలతో ప్రత్యేక వీడియో రూపొందించి దానిని షేర్‌ చేశారు. అందులో 'హరి హర వీరమల్లు'లో నిధి అగర్వాల్‌తో దిగిన ఫొటో కూడా ఉంది. ఈ ఫొటో స్క్రీన్‌ షాట్‌ను షేర్‌ చేసిన నిధి.. అది తన మొదటి సన్నివేశమని చెప్పింది. 
 
ఈ సందర్భంగా పవన్‌తో కలిసి నటించడంపై తన అనుభూతిని పంచుకుంది. ఆయనతో కలిసి నటించడంతో తన కల నేరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది. 'ఇలాంటి గొప్ప సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది. అద్భుతమైన చిత్రబృందంతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను నమ్మండి.. మీరు త్వరలోనే థియేటరులో అద్భుతాన్ని చూస్తారు' అంటూ పవన్‌ కల్యాణ్‌కు, క్రిష్‌కు కృతజ్ఞతలు తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దొంగతనం కోసం వెళుతూ మహిళను చంపేసిన దొంగలు... ఎక్కడ?