Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఖాతా తెరిచిన పవన్ కళ్యాణ్.. షేక్ అయిన ఇన్‌స్టాగ్రామ్

pawan kalyan
, మంగళవారం, 4 జులై 2023 (17:07 IST)
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కొత్తగా మరో సోషల్ మీడియా ఖాతాను తెరిచారు. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లోకి ప్రవేశించారు. పవన్ ఎంట్రీతో ఇన్‌స్టాగ్రామ్ షేక్ అయింది. కొన్ని గంటల వ్యవధిలోనే సుమారుగా పది లక్షల మంది పవన్ ఖాతాను ఫాలో చేయడం ప్రారంభించారు. ఆయన ఖాతా తెరిచారో లేదో.. ప్రతి గంట గంటకూ ఫాలోయర్లు పెరిగిపోయారు. 
 
ఇప్పటికే దాదాపు 9.16 లక్షల మంది ఇన్‌స్టాలో పవన్‌ను ఫాలో అవుతున్నారు. తొలి రోజు ఆయనను ఫాలో అయ్యే వారి సంఖ్య ఒక మిలియన్ అంటే పది లక్షల మంది దాటనుంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయమేమిటంటే.. పవన్ కళ్యాణ్ కేవలం ఖాతా మాత్రమే తెరిచారు. ఇంతవరకు ఆయన తన ఖాతాలో ఒక్కటంటే ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. 
 
ఇదిలావుంటే, ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా ఆయన తన రాజకీయాలకు సంబంధించిన విషయాలను ఎక్కువగా షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇన్‌స్టా వేదికగా రాజకీయాలతో పాటు సినిమా విశేషాలను కూడా షేర్ చేయనున్నారని తెలుస్తుంది. తన ఇన్‌స్టా ఖాతాకు పవన్ కళ్యాణ్.. "ఎలుగెత్తు.. ఎదురించు.. ఎన్నుకో.. జై హింద్" అనే నినాదాన్ని జతచేశారు. 
 
ధూలో ఘోరం.. దూసుకొచ్చిన ట్రక్... 
 
మహారాష్ట్రలోని ధూలేలో ఘోరం జరిగింది. ఒక భారీ కంటైనర్ ఒకటి ఒక్కసారిగా దూసుకుని రావడంతో పది మంది మృత్యువాతపడ్డారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. రోడ్డుపై ఉన్న వాహనాలను వరుసగా ఢీకొడుతూ కంటైనర్ లారీ దూసుకెళ్లింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో పది మంది చనిపోయారు. మరో 20 మంది వరకు గాయపడగా, వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
ధూలేలోని పలాస్నేర్ గ్రామ సమీపంలో హైవేపై వెళుతున్న కంటైనర్ లారీ ఈ నాలుగు వాహనాలను ఢీకొని ఆపై ఒక హోటల్‌లోకి దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ధూలేలోని ముంబై - ఆగ్రా జాతీయ రహదారిపై పలాస్నేర్ గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం 10.45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీస్ అధికారి తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీలో కిరణ్ కుమార్ రెడ్డి - ఈటల రాజేందర్‌లకు కీలక పదవులు