Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ఎస్వీ క‌ళాశాల గ‌వ‌ర్నింగ్‌బాడీ ఛైర్మ‌న్‌గా వైవి.సుబ్బారెడ్డి

Webdunia
బుధవారం, 13 మే 2020 (20:16 IST)
ఢిల్లీలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర క‌ళాశాల గ‌వ‌ర్నింగ్‌బాడీ ఛైర్మ‌న్‌గా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన‌ముల ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డిని ఎన్నుకున్నారు. కోశాధికారిగా ఎఫ్ఏసిఏవో ఓ.బాలాజిని ఎన్నుకున్నారు.

తాడేప‌ల్లిలోని ఛైర్మ‌న్ నివాసం నుంచి బుధ‌వారం ఢిల్లీ ఎస్వీ క‌ళాశాల గ‌వ‌ర్నింగ్‌బాడీ స‌మావేశాన్ని వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా నిర్వ‌హించారు. క‌ళాశాల ప్రిన్సిపాల్ డా.పి.హేమ‌ల‌తారెడ్డి మే 31న ఉద్యోగ విర‌మ‌ణ చేయ‌నుండ‌డంతో ఆమె స్థానంలో అసోసియేట్ ప్రొఫెస‌ర్ డా.ఎం.ప‌ద్మాసురేష్‌ను ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా నియ‌మించారు.

ఢిల్లీ యూనివ‌ర్సిటీ నియ‌మ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా నూత‌న‌ ప్రిన్సిపాల్ నియామ‌కం చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. అసోసియేట్ ప్రొఫెస‌ర్ డా.వెంక‌ట్‌కుమార్‌ను వైస్ ప్రిన్సిపాల్‌గా నియ‌మించారు.

ఢిల్లీ యూనివ‌ర్సిటీ నియ‌మ‌నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా క‌ళాశాల‌లో టీచింగ్‌, నాన్ టీచింగ్ సిబ్బంది నియామ‌కాల‌కు సంబంధించిన ప్ర‌క్రియ ప్రారంభించ‌డానికి గ‌వ‌ర్నింగ్‌బాడీ అనుమ‌తి మంజూరు చేసింది.

ఈ కాన్ఫ‌రెన్స్‌లో టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌, ,టిటిడి బోర్డు స‌భ్యులు, క‌ళాశాల గ‌వ‌ర్నింగ్‌బాడీ స‌భ్యులు డా. సుధా నారాయ‌ణ‌మూర్తి, వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి, డా. ఎం.నిశ్చిత‌, డిపి.అనంత‌, డా. బి.పార్థ‌సారథిరెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments