Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మద్య నియంత్రణకు ప్రభుత్వం మరొక ముందడుగు: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్, చైర్ పర్సన్

Advertiesment
మద్య నియంత్రణకు ప్రభుత్వం మరొక ముందడుగు: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్, చైర్ పర్సన్
, సోమవారం, 11 మే 2020 (21:15 IST)
ఇప్పటికే 20 శాతం మద్యం షాపులను తగ్గించిన ప్రభుత్వం మరొక 13 శాతం తగ్గిస్తూ  జీ.వో. ఎం.ఎస్.నెం.133 ఇవ్వటం శుభ పరిణామమని  ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్, చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సోమవారం హర్షం వ్యక్తం చేశారు.

మద్య నియంత్రణకు ప్రభుత్వం మరొక ముందడుగు వేసిందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వై ఎస్   జగన్మోహనరెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నేరుగా 43వేల బెల్టు షాపులు రద్దు చేయటం ద్వారా దశలవారీ మధ్య  నియంత్రణకు శ్రీకారం చుట్టారన్నారు.

4380 పర్మిట్ రూమ్ లు రద్దు చేశారని, 20 శాతం మద్యం దుకాణాలు రద్దు చేశారన్నారు . అంతేకాక మద్యం షాపులు తెరిచి ఉంచే సమయాన్ని బాగా తగ్గించారని, ఇప్పుడు తాజా జీవోతో మొత్తం 33 శాతం మద్యం దుకాణాలను రద్దు చేశారని, మహిళలకు ఎన్నికల ముందు వాగ్దానం చేసిన విధంగా మద్యం తాగే అలవాటును తగ్గించే విధంగా ఈ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదన్నారు. 

మద్యం ధరలను పెంచటం ద్వారా మద్యం అమ్మకాలు బాగా తగ్గినట్లు ఇప్పటివరకు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి . మద్య నియంత్రణకు ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యల వల్ల తమ కుటుంబాల్లో మగవాళ్ళు మద్యానికి దూరమై సంతోషంగా ఉంటున్నామని పలువురు మహిళలు పేర్కొంటున్నారన్నారు.

మహిళల పట్ల , నేరాలలో ప్రధాన పాత్ర వహిస్తున్న మద్యపాన నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాజకీయాలకు అతీతంగా అందరూ సమర్ధించటం అవసరం అన్నారు. 

అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం అమ్మకాలను ఆదాయ వనరుగా చూస్తున్న పరిస్థితిల్లో కుటుంబాల సంక్షేమం , సమాజ శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని కొన్ని కఠిన నిర్ణయాలను మన రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తుందన్నారు.

వచ్చే నాలుగేళ్ళలో మద్య నియంత్రణ సాధించి తీరుతామని చెపుతున్న ముఖ్యమంత్రి మాటలను ప్రతిపక్షాలు వక్రీకరించటం శోచనీయం వాసిరెడ్డి పద్మ ఆవేదన వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరెంట్ బిల్లులను రద్దు చేయాలి: కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్