Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలపై టిఆర్ఎస్ తుది కసరత్తు

Advertiesment
TRS
, శనివారం, 29 ఫిబ్రవరి 2020 (09:03 IST)
డిసిసిబి ,డీసీఎంఎస్ చైర్మన్ ,వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ వాటిలో విజయం సాధించేందుకు తుది కసరత్తు చేస్తున్నది.

ఇందులో భాగంగా ఈరోజు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పార్టీ నియమించిన జిల్లాల వారి పార్టీ ఎన్నికల పరిశీలకులు తో సమావేశమయ్యారు.

రేపు జరగనున్న చైర్మన్ వైస్, చైర్మన్ ఎన్నికల్లో పార్టీ నిర్ణయించిన అభ్యర్థులే విజయం సాధించేలా పార్టీ నాయకులు కృషి చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ పార్టీ ఎన్నికల పరిశీలకులు తెలిపారు. ఈ సందర్భంగా వారికి రేపు ఎన్నికల సందర్భంగా చేపట్టాల్సిన కార్యాచరణ పైన దిశానిర్దేశం చేశారు.

ముఖ్యమంత్రి మరియు పార్టీ అధ్యక్షులు కె. చంద్రశేఖర రావు నిర్ణయం మేరకు పార్టీ చైర్మన్ లను, వైస్ చైర్మన్ లను నిర్ణయించిన నేపథ్యంలో వారి  ఎంపికను సాఫీగా పూర్తయ్యేలా బాధ్యత తీసుకోవాలని తెలిపారు.

రాష్ట్రస్థాయిలో పార్టీ సమీకరణాలు, సామాజిక సమీకరణాల నేపథ్యంలో చైర్మన్లు వైస్ ఛైర్మన్ ల ఎంపిక జరిగిందని, ఇప్పటికే డైరెక్టర్గా ఎన్నికైన పార్టీ నాయకులు ఏకగ్రీవంగా ఎన్నిక ఎందుకు సహకరించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. 

తొమ్మిది జిల్లాలకు పరిశీలకులుగా వ్యవహరిస్తున్న నేతలు ఈ రోజే  జిల్లా కేంద్రాలకు చేరుకుని రేపటి ఎన్నిక అవసరమైన కార్యాచరణను సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఇందుకోసం జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే లతో కలిసి ముందుకు పోవాలి అన్నారు.

పార్టీ అధిష్టానం నిర్ణయించిన నాయకులే చైర్మన్లుగా వైస్ చైర్మన్ గా ఎన్నిక అవుతారని ఇదే పార్టీ నిర్ణయమని కేటీఆర్ తెలిపారు.  ఎన్నిక పర్యవేక్షణకు, ఉమ్మడి తొమ్మిది జిల్లాలకు పరిశీలకులను టిఆర్ఎస్ పార్టీ ఈరోజు పంపింది.

వీరికి ముఖ్యమంత్రి నిర్ణయించిన డిసిసిబి ,.డీసీఎంఎస్ చైర్మన్ ,వైఎస్ చైర్మన్ పేర్లతో ఉన్న సీల్డ్ కవర్లు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందజేశారు.
 
పార్టీ ఈ ఎన్నికల్లో భారీ ఎత్తున డైరెక్టర్లను గెలుచుకుంటుందని,రేపటి ఎన్నికల్లోనూ దాదాపు అన్ని వైస్ చైర్మన్ చైర్మన్ పదవులను గెలుచుకునే అవకాశం ఉందని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.

ఇప్పటికే ఎన్నికైన డైరెక్టర్లు అందరికీ  శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్, డైరెక్టర్లు గా ఎన్నిక కావడం కూడా మంచి గౌరవం అని,  కొన్ని సమీకరణాల వల్ల చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు దక్కని డైరెక్టర్ల కి పార్టీపరంగా భవిష్యత్తులో సముచిత స్థానం  కల్పిస్తామని కేటీఆర్ అన్నారు.
 
డిసిసిబి, డీసీఎంఎస్ ఎన్నికల ఉమ్మడి జిల్లాల పరిశీలకులు - 
నిజామాబాద్ -  సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి 
వరంగల్ - టి ఎస్ ఐఐ సి కార్పొరేషన్ చైర్మన్ గ్యాదరి బాలమల్లు 
అదిలాబాద్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్- దామోదర్ గుప్తా 
రంగారెడ్డి - ప్రభుత్వ మండలి విప్ ఎంఎస్ ప్రభాకర్ 
ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి - నల్గొండ 
మెదక్ - ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
ఖమ్మం- పార్టీ ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి
మహబూబ్ నగర్ ఎంపీ- బండ ప్రకాష్
కరీంనగర్ - ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ పదోతరగతి పరీక్షల్లో మార్పులు.. ఓఎమ్మార్‌ షీటులో విద్యార్థి ఫొటో