Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'స్థానిక' ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి : ఈసీ ఆదేశం

Advertiesment
'స్థానిక' ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి : ఈసీ ఆదేశం
, శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (15:14 IST)
స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని ఏపీలోని 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు రాష్ట్ర ఎన్నికల కమిషనరు ఎస్. రమేష్ కుమార్ ఆదేశించారు. ఆయన శుక్రవారం కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టణ ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతంలోనూ నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు తగిన ప్రణాళికలతో సంసిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
స్థానిక సంస్థల న్నికలకు సంబంధించి నిబంధనలను, మార్గదర్శకాలను తూ.చ., తప్పకుండా అమలు చేయడంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలి. స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి స్వేచ్చగా, ఖచ్చితత్వంతో, పారదర్శకంగా నిర్వహించే దిశలో కలెక్టర్లు క్షేత్రస్థాయిలో చేపడుతున్న చర్యలు సంతృప్తికం. ఎన్నికల నిర్వాహణకు సంబంధించి ముఖ్యంగా 7 అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని ఆయన సూచించారు. 
 
ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, ముద్రణ, బ్యాలెట్ బాక్సులు, ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ఇఓలు, ఏఇఓలు పురపాలక సంఘాలు, నగర పంచాయతీల పరిధిలో నియమించడం, ఎన్నికల సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లను గుర్తించడం, ఎన్నికల సామాగ్రి అయిన ఫార్మ్స్, కవర్లు, హ్యాండ్‌బుక్స్, ఇతర మెటీరియల్‌ను సిద్ధం చేసుకోవడం, బ్యాలెట్ పేపర్ల ముద్రణ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రాణాలు ఫణంగా పెట్టిన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది.. ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు