Webdunia - Bharat's app for daily news and videos

Install App

కురుపాంలో ఇద్దరు ఇంటర్ బాలికలపై అత్యాచారం

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (11:19 IST)
విజయనగరం జిల్లా కురుపాంలో ఇద్దరు మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. కొత్త సంవత్సర వేడుకలను జరుపుకుని కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఇద్దరు బాలికలను ఓ దండగుడు అడ్డగించి పోలీసునని బెదిరించి అత్యాచారానికి తెగబడ్డాడు. దీనిపై బాధిత విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని జియ్యమ్మవలస మండలానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు కురుపాంలోని పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో ఉంటూ ఇంటర్ చదువుతున్నారు. వీరిద్దరూ శనివారం మధ్యాహ్నం హాస్టల్ నుంచి బయటకు వచ్చిన రేగటి గ్రామానికి వెళ్లారు. అక్కడ కొత్త సంవత్సర వేడుకులను జరుపుకుని అక్కడి నుంచి తమ తమ ఇళ్లకు బయలుదేరారు. 
 
అయితే, మార్గమధ్యంలో రావాడ డ్యాం వద్ద రౌడీ షీటర్ రాంబాబు వారిని అడ్డగించి, పోలీసునని బెదిరించాడు. తాను చెప్పినట్టు వినకుంటే అరెస్టు చేస్తానని బెదిరించాడు. దీంతో వారిద్దరూ భయంతో వణికిపోయారు. తర్వాత ఒకరి తర్వాత ఒకరిపై లైంగికదాడికి తెగబడ్డాడు. ఆ తర్వాత వారిద్దరిని వదిలివేసి పారిపోయాడు. దీనిపై బాధిత బాలికలు తమ కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. రౌడీషీటర్ కోసం గాలిస్తున్నారు. బాలికలకు వైద్య పరీక్షలు చేయించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments