Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసు దర్యాప్తులో జాప్యమేల? సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Webdunia
సోమవారం, 20 మార్చి 2023 (18:38 IST)
మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హత్య కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న రాంసింగ్‌ను విచారణాధికారి బాధ్యతల నుంచి తప్పించి మరో అధికారిని నియమించాలని నిందితుడు శివశంకర్ రెడ్డి బార్య తులసమ్మ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. 
 
ఈ సందర్భంగా దర్యాప్తులో తీవ్ర జాప్యం నెలకొనడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హత్య కేసు దర్యాప్తును ఎందుకు పూర్తి చేయడం లేదని.. ఎందుకు ఆలస్యం చేస్తున్నారని విచారణ సందర్భంగా దర్యాప్తు అధికారిని ధర్మాసనం ప్రశ్నించింది. కేసు విచారణ త్వరగా ముగించకుంటే మరో అధికారిని ఎందుకు నియమించకూడదని కోర్టు ప్రశ్నించింది. 
 
వేరొకరిని నియమించడంపై సీబీఐ డైరెక్టర్‌ అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది. కేసు విచారణ పురోగతి, తాజా పరిస్థితిపై సీల్డ్‌ కవర్‌లో నివేదిక సమర్పించాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది. దర్యాప్తు అధికారి సక్రమంగానే విచారణ చేస్తున్నారని సీబీఐ తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ నటరాజన్‌ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం