Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్వలింగ సంపర్కం చట్ట విరుద్ధం.. ఈ వివాహాలను గుర్తించం : కేంద్రం

same marriage
, సోమవారం, 13 మార్చి 2023 (13:48 IST)
స్వలింగ సంపర్కం చట్ట విరుద్ధమని, ఒకే లింగానికి చెందిన పురుషులు లేదా మహిళలు చేసుకునే వివాహాలను గుర్తించబోమని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. స్వలింగ వివాహాలను హిందూ కుటుంబ వ్యవస్థతో పోల్చలేమని పేర్కొంది ఈ మేరకు స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించింది. ఈ తరహా వివాహాలకు గుర్తింపునివ్వడం అంటే ప్రస్తుతం అమల్లో ఉన్న పర్సనల్ లా ను ఉల్లంఘించడమేనని వివరించింది. అయితే, ఇద్దరు వ్యక్తుల పరస్పర అంగీకారంతో జరిగే లైంగిక చర్యలను చట్ట విరుద్ధమని అనలేమని కేంద్రం స్పష్టం చేసింది. 
 
పెళ్లి అనేది స్త్రీపురుషుడు (అపోజిటి సెక్స్) ఒక్కటయ్యేందుకు ఉద్దేశించిన వ్యవహారం. సామాజికంగా, సాంస్కృతికంగా, న్యాయపరంగా ఆమోదం లభించిన కార్యక్రమం. న్యాయ  వ్యవస్థ కల్పించుకుని ఇపుడు ఈ విధానాన్ని పలుచన చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. అసలు స్వలింగ వివాహాలు ప్రాథమిక హక్కుకాదు. 
 
ఇద్దరు వ్యక్తులు (సేమ్ సెక్స్) సహజీవనం చేయడం, జీవిత భాగస్వాములుగా ఉండాలని నిర్ణయించుకోవడం, ఇష్టపూర్వకంగా లైంగిక చర్యల్లో పాల్గొనడాన్ని భారతీయ కుటుంబ వ్యవస్థతో పోల్చలేమని కేంద్రం తెలిపింది. కుటుంబ వ్యవస్థలో భార్య, భర్త, పిల్లలు ఉంటారని, స్వలింగ వివాహాల విషయంలో భార్య లేదా భర్తలకు గుర్తింపు, నిర్వచనం ఇవ్వలేమని స్పష్టం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈఎంఐ చెల్లించేందుకు డబ్బులు ఇవ్వలేదనీ తండ్రిని సుత్తితో కొట్టి చంపిన తనయుడు.. ఎక్కడ?