Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్ క్రికెట్ సంఘంపై సుప్రీంకోర్టు కొరఢా.. ఏకసభ్య కమిటీ నియామకం

supreme court
, బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (10:09 IST)
దేశంలోని ప్రతిష్టాత్మక క్రికెట్ సంఘాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై సుప్రీంకోర్టు కొరఢా ఝుళిపించింది. గత కొన్నాళ్లుగా ఈ సంఘం కార్యకలాపాలు అస్తవ్యస్తంగా మారిపోయిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, పాలక వర్గంలో లుకలుకలు, ఆర్థిక అవకతవకలు, మ్యాచ్‌ల నిర్వహణ, టిక్కెట్ల విక్రయంలో అక్రమాలు ఇలా ఎన్నో రకాలైన అంశాలు వచ్చాయి. 
 
ముఖ్యంగా, ఒకపుడు అజారుద్దీన్, ఎంఎల్ జయసింహా, వీవీఎస్ లక్ష్మణ్, వెంకటపతిరాజు వంటి ప్రఖ్యాత క్రికెటర్లను అందించిన హైదరాబాద్ సంఘం అంతర్గత కుమ్మలాటలతో క్రికెట్ వ్యవహారాలను పక్కనబెట్టిందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. జట్టు ఎంపికలోనూ రాజకీయాలు చోటుచేసుకుంటాయి. 
 
మరోవైపు, దేశ వాళీ క్రికెట్ పోటీల్లో హైదరాబాద్ క్రికెట్ జట్టు ప్రదర్శన నానాటికీ పేలవంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రక్షాళనకు సుప్రీంకోర్టు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని రద్దు చేసింది. ప్రస్తుతం కమిటీ స్థానంలో ఏకసభ్య కమిటీని నియమిస్తూ సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. 
 
ఈ కమిటీలో మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర రావు సభ్యుడిగా ఉన్నారు. సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ఈ కమిటీ హెచ్.సి.ఏ కార్యకలాపాలను చూసుకుంటుంది. జస్టిస్ లావు నాగేశ్వర రావు కమిటీ రూపొందించే నివేదికను పరిశీలించిన తర్వాత తమ తదుపరి చర్యలు ఉంటాయని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది.
 
ఒకప్పుడు అజహరుద్దీన్, ఎంఎల్ జయసింహ, వీవీఎస్ లక్ష్మణ్, వెంకటపతిరాజు వంటి ప్రఖ్యాత క్రికెటర్లను అందించిన హైదరాబాద్ సంఘం అంతర్గత కుమ్ములాటలతో క్రికెట్ వ్యవహారాలను పక్కనబెట్టిందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. జట్టు ఎంపికలోనూ రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మద్యంమత్తులో అసభ్యంగా ప్రవర్తించిన వరుడు.. పెళ్లి రద్దు చేసిన వధువు .. ఎక్కడ?