Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ స్వామీజీ ఇకలేరు

Webdunia
ఆదివారం, 29 డిశెంబరు 2019 (10:35 IST)
కర్నాటక రాష్ట్రంలో సుప్రసిద్ధ పెజావర మఠాధిపతి విశ్వేశ తీర్థ స్వామీజీ ఇకలేరు. ఆయన వయసు 88 యేళ్లు. గత కొన్ని రోజులుగా అనారోగ్యానికిగురైన ఆయన.. బెంగుళూరులోని కేఎంసీ ఆస్పత్రిలో ఐసీయులో చికిత్స పొందుతూ స్పృహ కోల్పోయారు. 
 
ఆ తర్వాత ఆయన్ను ఆదివారం ఉదయమే స్వామీజీని ఉడిపి శ్రీకృష్ణ మఠానికి తరలించారు. మఠంలోనే వెంటిలేటర్స్, ఐసీయూ యూనిట్ ఏర్పాటు చేసి చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అశేష భక్తులను దుఃఖ సాగరంలో ముంచుతూ ఆయన కొద్ది సేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. ఉడిపి 'అష్ట' మఠాల్లో పెజావర మఠం ఒకటి.
 
కాగా, విశ్వేశ తీర్ధ స్వామీజీ ఈనెల 20న శ్వాసపీల్చుకోవడం కష్టం కావడంతో ఆసుపత్రికి తరలించారు. తొలుత న్యుమోనియా సమస్యలకు చికిత్స అందించినట్టు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం మరింత విషమంగా మారిందని, బ్రెయిన్ డిస్‌ఫంక్షన్ అని పరీక్షలో తేలిందని, ఇంకా స్పృహలోకి రాలేదని శనివారంనాడు వైద్యలు తెలిపారు. 
 
ఈ నేపథ్యంలో స్వామీజీ అభిమతం మేరకు లైఫ్ సపోర్ట్‌తోనే ఇవాళ ఉదయం మఠానికి తరలించారు. అయితో ఇంతలోనే విషాదం ముంచుకొచ్చింది. స్వామీజీ సమాచారం తెలియగానే కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి ఉడిపి శ్రీకృష్ణ మఠానికి చేరుకున్నారు. స్వామీజీ తుదిశ్వాస విడిచినట్టు ఉడిపి ఎమ్మెల్యే కె.రఘుపతి భట్ ప్రకటించారు.
 
పెజావర మఠాథిపతి విశ్వేశ తీర్ధ స్వామీజీ మృతికి కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్వామీజీ ఆత్మకు శాంతి కలగాలని, ఈ విషాదం నుంచి ఆయన అశేష భక్తులు కోలుకునేలా మానసిక స్థైర్యం కలిగించాలని ఆ కృష్ణ భగవానుని కోరుకుంటున్నానని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments