Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం చంద్రబాబుది విశిష్టపాలన సోనూసూద్!

ఠాగూర్
సోమవారం, 23 సెప్టెంబరు 2024 (12:15 IST)
సుదీర్ఘ పాలన అనుభవం ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈసారి తనదైనశైలితో దూసుకెళ్తున్నారు. ఓ వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి నినాదంతో పాలనలో తనదైన ముద్రవేస్తున్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇటీవలే వంద రోజులు పూర్తిచేసుకుంది.
 
ఈ నేపథ్యంలో చంద్రబాబు 100 రోజుల పాలనపై బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూసూద్ ప్రశంసల వర్షం కురిపించారు. తన విశిష్ట పాలనతో తొలి వంద రోజుల్లోనే ప్రజలు సుఖసంతోషాలతో, సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నారని కొనియాడారు.
 
పాలనలో ఎంతో అనుభవం ఉన్న సీబీఎన్ సర్ తన విజన్‌తో రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకుంటున్న చర్యలు భేష్ అని ప్రశంసించారు. ఆయన విధానాలను ప్రజలు విశ్వసిస్తున్నారని, చంద్రబాబును చూసి గర్వపడుతున్నానని తెలిపారు. త్వరలోనే ఆయనను కలవాలని కోరుకుంటున్నట్టు చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను మరింతగా తీర్చిదిద్దడంలో తన వంతు పాత్ర పోషిస్తానని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments