Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరులో వృద్ధురాలిపై అత్యాచారం, కొట్టి చంపిన గ్రామస్థులు

Webdunia
శనివారం, 29 మే 2021 (14:07 IST)
కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మానవ మృగం నీచానికి ఒడిగట్టింది. ఒంటరి మహిళను పొదల్లోకి లాక్కెళ్లి అమానుషంగా అత్యాచారం చేసింది. ఆ విషయం తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో కీచకుడిని కొట్టి చంపేశారు.

మహిళలపై నేరాల నియంత్రణకు కఠిన చట్టాలు తెచ్చినా.. ఉరిశిక్షలు విధిస్తున్నా కామాంధుల్లో కనీస భయం కలగడం లేదు. ఒంటరిగా మహిళ కనిపిస్తే కామంతో రెచ్చిపోతున్నారు కీచకులు. ఆఖరికి వృద్ధులను కూడా వదలని మానవ మృగాలు రోడ్లపై తిరుగుతున్నాయి. బ్యాంకుకు వెళ్లివస్తున్న ఓ వృద్ధురాలిని నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లి అత్యాచారం చేశాడో దుర్మార్గుడు. ఆ విషయం తెలుసుకున్న గ్రామస్థులు కీచకుడి అరాచకాలు భరించలేక కొట్టిచంపేశారు. ఏపీలోని
 
చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలు..
పుంగనూరు మండలం అప్పిగానిపల్లెకి చెందిన వృద్ధురాలు సమీపంలోని వనమలదిన్నె మినీ బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకుని తిరిగి బయలుదేరింది. ఆమెను అనుసరిస్తూ వచ్చిన అదే గ్రామానికి చెందని గురుమూర్తి(47) వనమలదిన్నె సబ్‌స్టేషన్ వెనుక పొదల్లోకి బలవంతంగా లాక్కెళ్లాడు. వృద్ధురాలనే కనీస కనికరం లేకుండా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. పశువులా కామవాంఛలు తీర్చుకున్నాడు.
 
అనంతరం ఆమె మెడలోని చైను, చెవిదిద్దులు, ముక్కుపుడకతో సహా డబ్బులు దోచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మృగాడి పైశాచికంతో స్పృహ కోల్పోయిన బాధితురాలు కొద్దిసేపటికి తేరుకుని వచ్చి గ్రామస్థులకు విషయం చెప్పడంతో ఆగ్రహంతో రగిలిపోయారు. గ్రామ సమీపంలోనే గురుమూర్తి ఉన్నాడని తెలియడంతో అతన్ని పట్టుకొచ్చారు.
 
మూకుమ్మడిగా రాళ్లు. కట్టెలతో దాడి చేయడంతో నిందితుడు గురుమూర్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై విచారణ జరుపుతున్నారు. అయితే నిందితుడు గురుమూర్తిపై గతంలోనూ అత్యాచారం కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments