Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంగ‌వీటి రాధా ఇంటి వ‌ద్ద రెక్కీ చేసిన వారి కోసం పోలీసులు గాలింపు

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (18:24 IST)
విజ‌య‌వాడ‌లో వంగ‌వీటి మోహ‌న రంగా త‌న‌యుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా త‌న హ‌త్య‌కు ప‌న్నాగం వేశార‌ని, త‌న‌పై రెక్కీ జ‌రిగింద‌ని రంగా వ‌ర్ధంతి నాడు తెలిపారు. ఆయ‌న ఒక స్టేట్ మెంట్ ఇచ్చిన వెంట‌నే ప్ర‌భుత్వం యాక్ష‌న్ ప్రారంభం అయిపోయింది. ముందుగా వంగ‌వీటి రాధాకు గ‌ట్టి భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు. ఏపీ సీఎం జ‌గ‌న్ నేరుగా స్పందించి, రాధాకు గ‌ట్టి సెక్యూరిటీ క‌ల్పించాల‌ని ఇంటెలిజెన్స్ వ‌ర్గాల‌ను ఆదేశించారు. దీనితో ఆయ‌న‌కు టూ ప్ల‌స్ టూ గ‌న్ మెన్ల‌ను ఏర్పాటు చేస్తూ, ఆదేశాలు జారీ అయ్యాయి. 
 
 
ఇపుడు అదే వంగ‌వీటి రాధా ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించిన వారి కోసం పోలీసుల గాలింపు చేస్తున్నారు.  విజ‌యవాడ నగరానికి చెందిన కొందరు వ్యక్తులపై పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. నిన్న ఉదయం నుంచి పోలీసుల అదుపులోనే విజ‌య‌వాడ కార్పొరేట‌ర్ ఆరవ సత్యం ఉన్న‌ట్లు తెలుస్తోంది.  పోలీసుల విచారణలో స్పృహ కోల్పోయిన ఆరవ సత్యంను చివ‌రికి ఆంధ్ర హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు స‌మాచారం. అయితే అర‌వ‌ సత్యంను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు ధృవీకరించ‌లేదు. 
 
 
అయితే, కార్పొరేట‌ర్ ఆరవ సత్యం దేవినేని అవినాష్ ప్రధాన అనుచరుడు కావ‌డం విశేషం. ఆయ‌న  విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీ ఫ్లోర్ లీడర్ కూడా కావ‌డంతో దేవినేని అవినాష్ అనుచరుడు కావడంతో రాజకీయవర్గాల్లో చర్చ ప్రారంభం అయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments