Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్ర‌ణాళికాబ‌ద్ధంగా విజయవాడ నగరం అభివృద్ది

ప్ర‌ణాళికాబ‌ద్ధంగా విజయవాడ నగరం అభివృద్ది
విజ‌య‌వాడ‌ , మంగళవారం, 28 డిశెంబరు 2021 (17:44 IST)
విజ‌య‌వాడ‌ నగర ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంగా 14వ ఆర్ధిక సంఘ నిధుల నుండి రూ.100 లక్షల వ్యయంతో ఆధునికీక‌రిస్తున్నారు. న‌గ‌రంలోని రాఘవయ్య పార్క్ లో వాకింగ్ ట్రాక్, ఫుడ్ కోర్ట్ ల‌ను రూ.50.96 కోట్ల ప్రభుత్వ గ్రాంటు, నగరపాలక సంస్థ సాధారణ నిధుల నుండి రూ. 243 లక్షల అంచనాలతో చేప‌ట్టారు. దండమూడి రాజగోపాలరావు ఇన్ డోర్ స్టేడియంలో ఆధునికీక‌ర‌ణ  పనులను మంత్రి బొత్స సత్యనారాయణ దేవాదాయశాఖ మంత్రి వర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ నియోజక వర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్, మేయర్ భాగ్య లక్ష్మీ, కమిషనర్ ప్రసన్న వెంకటేష్, ఐ.ఏ.ఎస్, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శైలజా రెడ్డి ప్రారంభించారు. 
 
                                                                                                                                                        ఈ సందర్బంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు క‌ల్పిస్తున్న  అధికారులను అభినందించారు. ముఖ్యమంత్రి వై.యస్.జగన్ లక్ష్యం నగరాభివృద్ధి అని, రాఘవయ్య పార్క్ ని‌ ఆధునీకరించి ప్రజలకి అందుబాటులోకి తీసుకువచ్చామ‌న్నారు. రెండున్నర కోట్లతో ఇండోర్ స్టేడియంని అభివృద్ది చేశామ‌ని, పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతాలు అభివృద్ది చేయాలన్నదే ప్రభుత్వం ఉద్దేశం అన్నారు.
 
                                                                                                                                                        మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, చిన్న పిల్లలను ఆకర్షించే విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రధాన పార్క్ లను ఆధునీకరిస్తున్నామ‌న్నారు. దానిలో భాగంగా రాఘవయ్య పార్క్  వాకింగ్ ట్రాక్, పాత్ వే, ఫుడ్ కోర్ట్, సీటింగ్ ప్లాజా, చిన్నారుల ఆట పరిక‌రాల ఏర్పాటు, ఆకర్షనీయమైన పెయింటింగ్, గ్రీనరీ మొదలగునవి ఏర్పాటు చేసి  పార్కులను ఆహ్లాద వాతావరణంలో తీర్చిదిద్దటం జరిగిందని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ అన్నారు. 
 
                                                                                                                                                        ఆధునీకరించిన ఇన్ డోర్ స్టేడియం కొత్త షటిల్ కోర్టులో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ షటిల్ ఆడారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు మొహమ్మద్ రేహానా నాహిద్, నెలిబండ్ల బాలస్వామి లతో పాటుగా పలువురు కార్పొరేటర్లు, కోఅప్టేడ్ మెంబర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీని ఊపేస్తున్న కరోనా.. ఎల్లో అలెర్ట్... సీఎం కేజ్రీవాల్ వెల్లడి