ఆంధ్రా అబ్బాయి - ఆఫ్గాన్ అమ్మాయి : విజయవాడలో పెళ్లి

Webdunia
శుక్రవారం, 8 జనవరి 2021 (13:10 IST)
ప్రేమకు హద్దులు లేవని అనేక మంది యువతీయవకులు పలు సందర్భాల్లో రుజువు చేస్తున్నారు. విదేశీ యువతుల ప్రేమలో పడుతున్న అబ్బాయిలు వారిని పెళ్లి చేసుకుంటున్నారు. ఈ కోవలోనే ఆంధ్రా అబ్బాయికి, ఆప్ఘాన్ అమ్మాయికి మధ్య ప్రేమ చిగురించి, అది పెళ్ళిపీటలెక్కించేలా చేసింది. విజయవాడ నగరంలో వీరిద్దరి పెళ్లి జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆప్ఘాన్ అమ్మాయి విజయవాడకు చెందిన అబ్బాయితో ప్రేమలోపడింది. అమ్మాయి పేరు ఫ్రోజ్‌ షిరీన్‌. అలాగే, అబ్బాయి పేరు వివేకానంద రామన్. అమ్మాయిల గతంలో యూఎన్‌వో కాన్సులేట్‌లో పనిచేసేది. అలాగే, అబ్బాయి కూడా ఢిల్లీలోని ఓ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో శిక్షణ పొంది, ప్రస్తుత బెంగుళూరులోని ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. 
 
అయితే, వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పైగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు కూడా సంతోషంగా సమ్మతించారు. అంతే... కుటుంబ పెద్దలను ఒప్పించి, పెద్దల సమక్షంలో దండలు మార్చుకున్నారు. ఇద్దరూ కలిసి హిందు సంప్రదాయం ప్రకారం పటమటలోని ఓ కల్యాణ మండపంలో గురువారం వివాహం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ లో మన శంకరవరప్రసాద్ గారు

Prashanth Varma: నా పై ఆరోపణలు అబద్దం, ప్రతీకారం గా జరుగుతున్నాయి: ప్రశాంత్ వర్మ

Suma: దంపతుల జీవితంలో సుమ కనకాల ఎంట్రీ తో ఏమయిందనే కథతో ప్రేమంటే

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments