Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలిక స్నానం చేస్తుండగా వీడియో.. వాటిని చూపి గర్భవతిని చేశాడు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (08:33 IST)
ఓ బాలిక స్నానం చేస్తుండగా, ఓ కామాంధుడు రహస్యంగా వీడియో తీశాడు. ఆ తర్వాత ఆ వీడియోను చూపి, ఆ బాలికను లోబరుచుకుని పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆ బాలిక గర్భందాల్చింది. ఈ ఘటన విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చీపురుపల్లి పట్టణంలోని జి.అగ్రహారానికి చెందిన ఓ బాలిక స్థానికంగా ఉండే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆ బాలిక స్నానం చేస్తుండగా అదే వెనుక ఇంటిలో ఉన్న చింతపల్లి రాజా అనే 22 ఏళ్ల యువకుడు రెండు నెలల క్రితం సెల్‌లో ఫొటోలతో పాటు.. వీడియో తీశాడు. 
 
ఈ వీడియో, ఫోటోలను చూపి, తన కోర్కె తీర్చాలని, లేనిపక్షంలో ఫేస్‌బుక్‌లో పెడతానంటూ బెదిరించసాగాడు. దీంతో భయపడిపోయిన ఆ బాలిక... చేసేది లేక ఆ కామాంధుడికి లొంగిపోయింది. 
 
ఈ క్రమంలో నెలలు గడుస్తున్నా ఆ బాలికకు రుతుస్రావం కాలేదు. దీంతో అనుమానించిన తల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించగా గర్భవతి అని తేలింది. ఆ తర్వాత బాలికను తల్లి నిలదీయగా అసలు విషయం చెప్పింది. 
 
దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బొబ్బిలి డీఎస్పీ మంగళవారం చీపురుపల్లి వచ్చి దర్యాప్తు నిర్వహించారు. యువకుడు రాజును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం