Webdunia - Bharat's app for daily news and videos

Install App

28 నుండి 3టైర్‌లో వాహన బదిలీలకు అనుమతి

Webdunia
బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (07:39 IST)
పాతవాహనాలు విక్రయించే సమయంలో వాహన యజమానులు వాహన బదిలీల ఫారాలపై భౌతికంగా సంతకం చేసినా కూడా ప్రస్తుతం ఆన్లైన్ విధానంలో యజమాని తప్పనిసరి కావడంతో అందుబాటులో లేని వాహన యజమానుల వాహనాల లావాదేవీలు ఆగిపోవడం జరిగాయని, అటువంటి  వాహనాల బదిలీలను పాతవిధానం (3టైర్ సాఫ్ట్‌వెర్)లో అనుమతించడం జరుగుతుందని, డిటీసీ ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు.

స్థానిక డిటీసీ కార్యాలయంలో డిటీసీ మాట్లాడుతూ- గతంలో అమ్మిన వాహనాల యజమానులు అందుబాటులో లేకపోవడం వలన బదిలీలు జరుపుకోకుండా ఉన్నవారికి  పాత విధానం 3టైర్ సాఫ్ట్‌వెర్‌లో ఈ నెల 28 నుండి మార్చి 7వ తేదీ వరకు వాహన బదిలీలు జరుపుకొనే విధంగా రాష్ట్ర రవాణాశాఖ ఉత్తర్వులను జారీ చేయడం జరిగిందని తెలిపారు.

ఫైనాన్షియర్లు చేసుకున్న అభ్యర్థనలను పరిశీలించిన రాష్ట్ర రవాణాశాఖ కొంత వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయాలు తీసుకొని ఆదేశాలను జారీ చేసిందని డిటీసీ తెలిపారు.

గతంలో వాహనాలపై తీసుకున్న ఫైనాన్స్ కు సంబంధించిన మొత్తం రుసుమును చెల్లించి, ఫైనాన్సర్ నుండి ఫారం 35, కవరింగ్ లెటర్లపై సంతకాలు చేసినవి, సంతకంలు చేసిన కూడ ఫైనాన్సర్ లు అందుబాటులో లేకపోవడం లేదా ఫైనాన్స్ కంపెనీలు ఎత్తివేయడం వంటి వాటిని గమనించి పాతవిధానం 3టైర్ సాఫ్ట్ వెర్ లో లావాదేవీలు జరుపుకోనే విధంగా వారం రోజులపాటు అవకాశం కల్పించామని అన్నారు.

ఒక ఆర్టిఏ కార్యాలయం నుండి వేరొక ఆర్టీఏ కార్యాలయంనకు క్లియరెన్స్ సర్టిఫికెట్ లు పొంది, బదిలీల నిమిత్తం ఫారం 29,30లపై సంతకం చేసినటు వంటివి కూడా పాత విధానం 3టైర్ సాఫ్ట్ వెర్ లో వాహన లావాదేవీలు జరుపుకోవచ్చని ఆయన తెలిపారు.

వాహనం కొనుగోలు చేసిన వ్యక్తి సంబంధిత ఆర్టీఓ కార్యాలయంలలో వాహన రికార్డులతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మధ్యవర్తులను దళారులను ఆశ్రయించవద్దని నేరుగా ఆర్టిఏ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని డిటిసి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments