Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోడి పందేలకు అనుమతి లేదు

Advertiesment
కోడి పందేలకు అనుమతి లేదు
, మంగళవారం, 7 జనవరి 2020 (05:54 IST)
విజయవాడ ఈస్ట్ డివిజన్ పరిధిలో కోడి పందేలకు  ఎలాంటి అనుమతి లేదని ,ఎవరైనా మీరి కోడి పందేలు వేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని డి.సి.పి. వి.హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు.

గన్నవరం సర్కిల్ కార్యలయంలో ఎర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డి.సి.పి.మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఆయా ప్రాంతాల్లో కోడి పందేలు జరుగుతున్నాయని ,కానీ ఈ ఏడాది ఏక్కడ కోడిపందేలకు ఎలాంటి అనుమతులు లేవని ,కనుక ఎవరైన  కోడిపందేలకు బరిలు ఎర్పాటు చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామనిమరోసారి హెచ్చరించారు.

కోడిపందేలు బరిలు ,ఎర్పాటు చేసెవారు కత్తులు కట్టేవారిపై బైండవర్ కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఈస్ట్ డివిజన్ లో 71కేసులు నమోదు చేసి ,117మందిపై బైండవర్ కేసులు నమోదయ్యాయి. ఇలాగే మరో వారంరోజుల్లో  అలాంటి కార్యక్రమాలు చెసేవారిని ఓకంట కనిపెడుతున్నామని ,పెకాట ఆడుతున్న38మందిని అదుపులోకి తీసుకుని40,000రూపాయల నగదు స్వాదీనంచేసుకున్నట్లు హర్షవర్ధన్ రాజు చెప్పారు.

పేకాట, కోడిపందేలు వేయవద్దని ,అలాకాదని ఆటలకు పాల్పడితె కేసులు తప్పవని ,ప్రజల ందరు సహకరించాలని కోరారు.

జోసఫ్ తంబీ ఉత్సవాలకు బందోబస్తు..
ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి బ్రదర్ జోసెఫ్ తంబీ 75వ ఉత్సవాలు ఈనేల 13,14,15 తేదిలో జరుగుతాయాని ,ఈఉత్సవాలకు దేశంలో వివిధ ప్రాంతాలనుంచి భక్తులు పెద్ద ఎత్తున హజరువుతారని ,ప్రతి ఎడాది4,5లక్షలమంది భక్తులు వస్తుంటారని ,ఈఏడాది భక్తులు సంఖ్య పెరుగుతోందని ,అందుకు తగ్గ ట్టుగాపోలీసు ప్రత్యేక దృష్టి పెట్టిందని ,300మంది వివిధ స్థాయి పోలీసు అధికారులు పనిచేస్తారని అన్నారు.

జాతీయ రహదారి పనులు జరుగుతున.,నేపథ్యంలో ఎన్.హెచ్.ఐ.అధికారులతోప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని కోరామని డి.సి.పి.తెలిపారు. తంబీ ఆశ్రమ అధికారులకు సుచించామన్నారు.ఎ.సి.పి.సురేంద్ర నాధ్ రెడ్డి ,సి.ఐ.కె.శ్రీనివాసరావు ,ఎస్.ఐ.వాసిరెడ్డి శ్రీనివాస్ లు పాల్గోన్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటుకు వడివడిగా అడుగులు