Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

50 శాతం రిజర్వేషన్ల​తో ఎన్నికల్లో పోటీ చేసే దమ్ముందా?: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

50 శాతం రిజర్వేషన్ల​తో ఎన్నికల్లో పోటీ చేసే దమ్ముందా?: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు
, మంగళవారం, 7 జనవరి 2020 (05:44 IST)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా రిజర్వేషన్లు కేటాయించటం సరికాదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు.

విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీస్ స్టేషన్​లో ముందస్తు బెయిల్ సమర్పించిన అనంతరం అంబేద్కర్ కూడలి వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. జగన్​కు దమ్ముంటే పంచాయతీ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లతో బరిలో దిగాలని అయ్యన్నపాత్రుడు సవాల్ విసిరారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా రిజర్వేషన్లు కేటాయించి, ఎన్నికలు తప్పించుకునే ప్రయత్నాలు చేయొద్దన్నారు.

కోడి పందాలపై... తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోడి పందేలు పెడితే నర్సీపట్నంలో తాను నిర్వహిస్తానని అయ్యన్న ప్రకటించారు. ఆ జిల్లాలకు ఒక న్యాయం... విశాఖ జిల్లాకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. రెండు రోజుల పాటు నర్సీపట్నంలో స్వయంగా కోడిపందేలు నిర్వహిస్తానని అన్నారు. ఎవరు అడ్డుకుంటారో చూద్దామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా- ఇరాన్ యుద్ధంతో మనకేంటి?