జగన్ పాలన మహిళలకు స్వర్ణయుగమా? గుడ్ బుక్ పేరుతో మోసానికి శ్రీకారం : వాసిరెడ్డి పద్మ (Video)

ఠాగూర్
బుధవారం, 23 అక్టోబరు 2024 (15:11 IST)
తాను ఏపీ రాష్ట్ర మహిళా సంఘం చైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలో అనేక విషయాలు జరిగాయని, వాటిపై నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదని ఆ పార్టీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ, తాను మహిళా చైర్ పర్సన్‌గా ఉండగా, అనేక విషయాలు నాడు ప్రభుత్వం ముందు పెట్టినా పట్టించుకోలేదని వాపోయారు. మహిళల విషయంలో ఇప్పుడు జగన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని, జగన్ రెడ్డి పాలన ఏమైనా మహిళలకు స్వర్ణయుగమా? రోజుకో వికృతమైన ఘటన నాడు మహిళలపై జరిగినా, ఏ నాడు జగన్ రెడ్డి బయటకు రాలేదు, ఒక్క పరామర్శ చేయలేదు. 
 
ఆ రోజు హోంమంత్రి స్పందించేది కాదు. చాలా విషయాలు నాడు తొక్కి పెట్టారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు మాత్రం రాజకీయం చేయటానికి రోడ్లపైకి వస్తున్నారని, నీకు రాజకీయం చేయటానికి మహిళలే దొరికారా అంటూ ఆమె మండిపడ్డారు. జగన్ రెడ్డికి బాధ్యత లేదని ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడిన వారిని మోసం చేశారనీ, ఇప్పుడు అధికారం పోయాక మరోసారి గుడ్‌‍బుక్ పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వైసీపీని వ్యాపార సంస్థలా నడిపారంటూ ధ్వజమెత్తారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments