Webdunia - Bharat's app for daily news and videos

Install App

Valentines Day: ప్రేమోన్మాది ఘాతుకం- యువతి తలపై కత్తితో పొడిచి.. ముఖంపై యాసిడ్ పోశాడు

సెల్వి
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (12:17 IST)
ప్రేమికుల రోజును ప్రపంచ వ్యాప్తంగా లవర్స్ హ్యాపీగా జరుపుకుంటున్నారు. అయితే కొందరు ప్రేమోన్మాదులు తమ ప్రేమను అంగీకరించని వారిపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేమను అంగీకరించలేదని.. నిరాకరించిందనే కోపంతో యువతి తలపై కత్తితో పొడిచాడు. అంతటితో ఆగకుండా మొహంపై యాసిడ్ పోశాడు. 
 
గౌతమి అనే యువతిపై గణేష్ అనే యువకుడు ఈ అమానుష చర్యకు దిగాడని పోలీసులు తెలిపారు. యువతికి పెళ్లి నిశ్చయం కావడంతో పాటు ఆమె అతడి ప్రేమను నిరాకరించిందని.. అందుకే తలపై కత్తితో పొడిచి.. ముఖంపై యాసిడ్ పోశాడని పోలీసుల విచారణలో తేలింది. 
 
బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ ఆమెను పరిశోధించిన వైద్యులు యువతి పరిస్థితి విషమంగా వుందని చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవితో నృత్యం చేసిన నిర్మాత అల్లు అరవింద్ (Video)

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments