Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో శాస్త్రోక్తంగా ఉట్లోత్సవం

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (21:42 IST)
శ్రీ‌ కృష్ణ‌జ‌న్మాష్ట‌మి వేడుక‌ల్లో భాగంగా తిరుమలలో శ్రీవారి ఆలయంలో ఉట్లోత్సవ ఆస్థానం  మంగళవారం సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు శాస్త్రోక్తంగా జరిగింది. కోవిడ్ - 19  వ్యాప్తి నేపథ్యంలో ఈ వేడుకలు  ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. 
 
శ్రీవేంకటేశ్వరస్వామివారికి గోకులాష్టమి ఆస్థానం నిర్వహించిన మరునాడు ఉట్లోత్సవాన్ని(శిక్యోత్సవం) నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులోభాగంగా శ్రీ మలయప్పస్వామివారిని  బంగారు తిరుచ్చిపై ప్రసాదాలు తయారు చేసే పోటు లోనికి, శ్రీ కృష్ణస్వామివారిని మరో తిరుచ్చిపై పోటు మండపంలోని కి వేంచేపు చేసి నివేదన, హారతి ఇచ్చారు.
 
అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో స్వామివార్లను వేంచేపు చేసి ఆస్థానం, నివేదన, హారతి  సమర్పించారు.
 
ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఇఓ రమేష్ బాబు, వీజీవో బాలి రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments