పరీక్షల కోసం ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించుకోండి

Webdunia
సోమవారం, 13 జులై 2020 (20:08 IST)
ఆస్పత్రుల్లో అడ్మిషన్ల సమయంలో కరోనా అనుమానితుల పరీక్షల కోసం ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించుకోవాలని ఏపీ వైద్యారోగ్యశాఖ ఆదేశించింది. జిల్లాకు 20 వేల చొప్పున ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు కిట్లను ప్రభుత్వం పంపించింది.

ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో పాజిటివ్ అని తేలితే తక్షణం చికిత్స ప్రారంభించి సదరు రోగిని ఐసోలేట్ చేయాలని జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్ఓలకు సూచనలు చేసింది. కరోనా లక్షణాలు కలిగి యాంటీజెన్ టెస్టులో నెగెటివ్ వస్తే  అలాంటి వారికి మరోమారు రియల్ టైమ్‌లో ఆర్టీపీసీఆర్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

హైరిస్కు కేసులు కలిగిన ప్రాంతాలు, కంటైన్మెంట్ జోన్లలో వ్యాధి లక్షణాలు కలిగి కరోనా నెగెటివ్ ఫలితాలు వచ్చిన వారిని కూడా పరీక్షించాల్సిందిగా సూచనలు జారీ చేశారు. ఆస్పత్రుల్లో గర్భిణులు, శస్త్ర చికిత్స చేయాల్సిన రోగులకు పరీక్షించేందుకు కూడా ఈ కిట్లు వినియోగించాలని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది.

క్వారంటైన్ కేంద్రాల్లో 10 రోజుల క్వారంటైన్ అనంతరం డిశ్చార్జి అవుతున్న వారిని కూడా ఈ కిట్లతో పరీక్షించవచ్చని సూచించింది. అయితే కరోనా లక్షణాలు కలిగి ఉన్న రోగులందరినీ డిశ్చార్జి చేసేందుకు ట్రూనాట్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments