గోనె సంచిలో గుర్తు తెలియని మహిళ శవం

Webdunia
శనివారం, 11 జనవరి 2020 (11:45 IST)
చిత్తూరు జిల్లాలో ఓ గోనె సంచిలో గుర్తు తెలియని మహిళ శవాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని పీలేరు రూరల్ సీఐ మురళి కృష్ణ తెలిపారు. సిఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 
 
కె.వి పల్లి మండలం గ్యారంపల్లె కస్పా సమీపంలోని పీలేరు రాయచోటి జాతీయ రహదారిలోగల వ్యవసాయ పొలాల్లో ఓ గుర్తు తెలియని మహిళ శవాన్ని గోనెసంచిలో తెచ్చి పడవేసినట్లు స్థానికులు ఫిర్యాదు మేరకు కనుగొన్నామన్నారు. ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పీలేరు రూరల్ సీఐ మహిళ శవాన్ని పరిశీలించగా ఆమె ఆకుపచ్చని చీర ఎర్రని జాకెట్ ధరించి ఉంది. 
 
అలాగే ఆమె మెడలో రోల్డ్ గోల్డ్ చైనుపై ఏవైఏ అనే అక్షరాలను గుర్తించారు. గుర్తుతెలియని మహిళను హతమార్చి ఇక్కడ తెచ్చి పడవేశారన్న అంశంపై ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు. పై ఆచూకీ గల మహిళ ఎవరైనా గుర్తించినట్లయితే పీలేరు రూరల్ సిఐకు సమాచారం అందించగలరని సూచించారు. మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dharmendra Health Update: ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా వుంది.. ఇషా డియోల్

మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా లవ్ స్టోరీతో సాగే సంతాన ప్రాప్తిరస్తు - నిర్మాతలు

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీతో గత వైభవం ట్రైలర్

జూటోపియా 2 లో జూడీ హాప్స్‌కి వాయిస్‌ ఇచ్చిన శ్రద్ధా కపూర్‌

Faria Abdullah: సందీప్ కిషన్ హీరోగా సిగ్మా పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments