హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ బాత్రూంలో విద్యార్థిని మృతదేహం... ఏమైంది?

Webdunia
సోమవారం, 22 జులై 2019 (18:15 IST)
అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హాస్టల్‌లోని బాత్రూంలో మృతి చెందిన సంఘటన సోమవారం ఉదయం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖరగ్‌పూర్ నగరానికి చెందిన దీపికా మహాపాత్ర (29) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్.డి చదువుతోంది. 
 
ఈ విద్యార్థిని సోమవారం నాడు ఉదయం 8 గంటల ప్రాంతంలో బాత్రూంలో అనుమానాస్పద స్థితిలో పడిపోయి ఉంది. తోటి విద్యార్థులు చూసి వెంటనే కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందించారు. కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించడంతో సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఆ విద్యార్థిని స్థానిక ఓ ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. 
 
అప్పటికే ఆమె చనిపోయిందని హాస్పిటల్ వర్గాలు నిర్ధారించారు. అయితే పోలీసులు అప్పటికే ఆమె మెడికల్ రికార్డులు, తోటి స్నేహితులు బంధువులను పరిశీలించి ఆమెకి మెదడుకు సంబంధించిన కొన్ని వ్యాధులు ఉన్నట్లు  పేర్కొన్నారు. ఆ వ్యాధుల వలన ఆమె కళ్ళు తిరిగి పోయి బాత్రూంలో మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments