Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కన్నతల్లిని వేధించిన కొడుక్కి జైలుశిక్ష : మల్కాజిగిరి కోర్టు తీర్పు

కన్నతల్లిని వేధించిన కొడుక్కి జైలుశిక్ష : మల్కాజిగిరి కోర్టు తీర్పు
, సోమవారం, 22 జులై 2019 (16:59 IST)
కన్నతల్లిని వేధించిన ఓ కొడుక్కి మల్కాజిగిరి కోర్టు జైలుశిక్ష విధించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తండ్రి చనిపోయిన తర్వాత ఇల్లు కోసం తల్లిని వేదించిన కొడుకు అమిత్ వేదింపులు తట్టుకోలేక కొడుకుపై 2015లో నెరేడ్మేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కన్న కొడుకే కోడలితో కలిసి తనను వేధిస్తున్నాడని అంతేకాకుండా నాఇంటి నుంచి నన్ను వెళ్లగొడుతున్నారంటు 70 సంవత్సరాల వృద్ధురాలు 2015 సంవత్సరంలో నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
అప్పట్లో తల్లి ఫిర్యాదు మేరకు కొడుకు అమిత్ కుమార్, కోడలు షోబిత లావణ్యలపై నేరేడ్మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మేరకు విచారణ జరిపిన కోర్టు ఈరోజు వారిద్దరికీ రెండు సంవత్సరాలు జైలు శిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విధించింది. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిల్ కాలనీలో నివాసం ఉండే ప్రేమ కుమారి 70 సంవత్సరాల వృద్ధురాలికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. 2013 సంవత్సరంలో భర్త చనిపోయాడు, భర్త చనిపోకముందే పిల్లల వివాహాలు జరిపించాడు. ఎవరికి వారు వేరు కాపురాలు ఉంటున్నారు. భర్త చనిపోవడంతో పెద్ద కుమారుడు నుంచి తల్లికి వేధింపులు మొదలయ్యాయి. 
 
ముషీరాబాద్‌లో నివాసం ఉండే పెద్ద కుమారుడు అమిత్ కుమార్ భార్యతో సహా ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించమేకాకుండా తల్లిని బలవంతంగా బయటకు పంపేందుకు రకరకాల ప్రయత్నాలు చేశాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని భార్యతో కలిసి క్రూరంగా హింసించడం మొదలుపెట్టాడు. ఇది భరించలేని తల్లి 2015 సంవత్సరంలో నేరేడ్మెట్ పోలీసులను ఆశ్రయించగా అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
నాలుగు సంవత్సరాలు పాటు కోర్టులో నడిచిన కేసు సోమవారం తన తీర్పును వెల్లడించింది. పెద్ద కుమారుడు అమిత్ కుమార్  మరియు కోడలు షోబిత లావణ్యలకు రెండు సంవత్సరాలు జైలు శిక్షతో పాటు చేరో రూ 10 వేల రూపాయల జరిమానా కూడా విధించింది. ఇది కనీపెంచిన తల్లిదండ్రులను వేధించే పిల్లలకు గుణపాఠంగా చెప్పుకోవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో బిగ్ బాస్-3 ప్రసారాలు నిలిపివేస్తారా? బీజేపీ ఏమంటోంది?