ప్యాంటు జేబులో రాజీనామా లేఖను పెట్టుకుని తిరుగుతున్న కేంద్రమంత్రి.. ఎవరు?

పూసపాటి అశోకగజపతిరాజు. ఈయన నిజంగానే రాజవంశీయుడు. విజయనగరం జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి పెద్దతలకాయ వంటి నేత. ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్నారు.

Webdunia
బుధవారం, 7 మార్చి 2018 (11:17 IST)
పూసపాటి అశోకగజపతిరాజు. ఈయన నిజంగానే రాజవంశీయుడు. విజయనగరం జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి పెద్దతలకాయ వంటి నేత. ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్నారు. ఈయన పౌరవిమానయాన మంత్రిత్వ శాఖామంత్రిగా ఉన్నారు. అయితే, ఈయన గత కొన్ని రోజులుగా తన రాజీనామా లేఖను లేఖను జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు. 
 
పైగా, అధినేత ఆదేశిస్తే అయిదు నిముషాల్లో లేఖ ఇచ్చేస్తానని చెబుతున్నారు. అంతేనా, ఏ క్షణంలోనైనా ఇటువంటి లేఖ ఇవ్వాల్సి వస్తుందని ఆయన ముందుగానే సిద్ధం చేసుకున్నారు. ప్యాంటు జేబులోంచి లేఖ తీసిన వెంటనే సమావేశంలో పాల్గొన్న ఎంపీలంతా సైలెంట్ అయిపోయారు. అడిగిన ఎంపీ కూడా ఆశ్చర్యపోయారు. అధినేత సర్దిచెప్పేసరికి లేఖ మళ్లీ ప్యాంటు జేబులోకి వెళ్లిపోయింది. 
 
నిజానికి అశోకగజతి రాజు ఎన్నికల్లో గెలిచినా, ఓడినా నిరాడంబరంగా.. నిజాయితీగా.. నిర్మోహమాటంగా ఉంటారు. ఆయన వ్యక్తిత్వం అంత గొప్పది కాబట్టే ప్రధాని నరేంద్ర మోడీకి కూడా నచ్చేశారు. అలాగని ప్రధాని మెచ్చుకున్నారని పొంగిపోలేదు. చంద్రబాబుకు అశోక్‌ గజపతిరాజు అత్యంత విశ్వాసపాత్రులు. ఆయనకు రాష్ట్ర ప్రయోజనాలు.. అధినేత ఆదేశాలే ముఖ్యం. అదే విషయాన్ని నిర్మోహమాటంగా చెబుతారాయన.
 
దేశ పౌర విమానయానశాఖ మంత్రి అయినప్పటికీ క్యూలో నిలబడే బోర్డింగ్‌ పాస్‌ తీసుకుంటారు. విమానం ఎక్కే సమయంలో కూడా క్యూ లైన్‌ పాటిస్తారు. సహచర ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి విమానాశ్రయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినప్పుడు ఆయనపై నిబంధనల ప్రకారం చర్యలకే మొగ్గు చూపారు. అలాంటి ఎంపీ అశోక్‌ గజపతిరాజు రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారంటే... 
 
రాష్ట్రానికి విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు పూర్తిగా విఫలమైంది. దీంతో కేంద్ర మంత్రి పదవుల్లో ఉన్న టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయాలన్న డిమాండ్ల వస్తున్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన పూసపాటి అశోకగజపతి రాజు... తన రాజీనామా లేఖను ఎల్లవేళలా జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments