Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెదేపా కేంద్రమంత్రులు రాజీనామా చేస్తారు : మంత్రి ఆదినారాయణ రెడ్డి

ప్రత్యేక హోదా సాధనలో భాగంగా పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తర్వాత అంటే ఏప్రిల్ 6వ తేదీన వైకాపాకు చెందిన ఎంపీలు రాజీనామాలు చేస్తారనీ ఆ పార్టీ అధినేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రకటించార

Advertiesment
AP Minister Adinarayana Reddy
, శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (09:13 IST)
ప్రత్యేక హోదా సాధనలో భాగంగా పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తర్వాత అంటే ఏప్రిల్ 6వ తేదీన వైకాపాకు చెందిన ఎంపీలు రాజీనామాలు చేస్తారనీ ఆ పార్టీ అధినేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. దీనికి ధీటుగా, వైకాపా ఎంపీల కంటే ముందుగానే అంటే మార్చి ఆరో తేదీనే టీడీపీ తరపున కేంద్ర మంత్రులుగా ఉన్నవారు ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గం నుంచి వైదొలుగుతారని రాష్ట్ర మార్కెటింగ్ శాఖామంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రకటించారు.
 
ఆయన గురువారం సాయంత్రం సచివాలయంలో మీడియా ముందు ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు మార్చి ఐదో తేదీన మొదలు కాగానే.. ఆరో తేదీన కేంద్ర ప్రభుత్వంలోని తమ మంత్రులు రాజీనామా చేస్తారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి హామీ ఇచ్చిన 19 అంశాలను నెరవేర్చాల్సిందేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ సమస్యలు పరిష్కరించకుండా ఇలాగే వ్యవహరిస్తే మార్చి 6న రాజీనామాలు చేయిస్తామని తేల్చి చెప్పారు. ఇక బీజేపీతో తెగదెంపులు చేసుకుంటామని ప్రకటించారు. 
 
ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. సీఎం చంద్రబాబు ఆయన ప్రకటనపై ఆగ్రహం వ్యక్తంచేశారు. విధాన నిర్ణయాలను పార్టీ అధినాయకత్వం తీసుకుంటుందని, తొందరపడి మాట్లాడవద్దని మందలించినట్లు సమాచారం. దీనిపై టీడీపీ రాష్ట్ర కార్యాలయ వర్గాలు కూడా మంత్రితో మాట్లాడాయి. దీంతో మంత్రి మరోసారి మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తారన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని వివరణ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోడీకి చంద్రబాబు షాక్ ... కేంద్ర మంత్రి పదవులకు రాంరాం?