Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ అధికారులపై కేసు నమోదైంది.. వారిని సస్పెండ్ చేయాలి : ఉండి ఎమ్మెల్యే

వరుణ్
గురువారం, 18 జులై 2024 (18:30 IST)
తనపై హత్యాయత్నానికి పాల్పడిన మాజీ సీఐడీ విభాగం డీజీ సునీల్ కుమార్, విజయ్ పాల్, మాజీ ముఖ్యమంత్రి జగన్, గుంటూరు జనరల్ ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ ప్రభావతిలపై కేసు నమోదైందని తెలుగుదేశం పార్టీకి చెందిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తెలిపారు. వీరిలో సునీల్ కుమార్, విజయ్ పాల్, డాక్టర్ ప్రభావతిలను తక్షణం సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
తనపై హత్యాయత్నం చేశారని సీఎం జగన్‌, సీఐడీ అధికారులపై ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కేసుకు సంబంధించి వివరాలు, పురోగతి గురించి తెలుసుకునేందుకు ఆయన గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు సీఐడీ కార్యాలయంలో తనను చంపేందుకు కుట్ర పన్నారని, మీడియా వల్లే బతికిపోయానని తెలిపారు. 
 
'నా ఫిర్యాదు మేరకు మాజీ సీఐడీ డీజీ సునీల్‌కుమార్‌, విజయ్‌ పాల్‌, మాజీ సీఎం జగన్‌, జీజీహెచ్‌ ప్రభావతిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు వివరాలు తెలుసుకోవడానికే ఎస్పీ కార్యాలయానికి వచ్చాను. నా దగ్గర ఉన్న సమాచారం అందించాను. అప్పటి కలెక్టర్‌ తీసుకున్న చర్యలు కూడా నిబంధనకు విరుద్ధంగా ఉన్నాయి. కేసు నమోదైంది కాబట్టి.. సీఐడీ అధికారుల్ని సస్పెండ్‌ చేయాలి' అని రఘురామ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments