మామూలుగా మనం రోడ్డుపైన వెళ్ళేటప్పుడు కవల పిల్లలు వెళుతుంటే ఆశక్తి చూస్తుంటాం. ఇద్దరు కవల పిల్లలను చూస్తేనే సంభ్రమాశ్చర్యంతో వారి దగ్గరకు వెళ్లి పలుకరించి వస్తుంటాం..లేకుంటే దూరం నుంచి చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటాం.. కానీ తిరుపతిలో ఒకేసారి 74మంది
మామూలుగా మనం రోడ్డుపైన వెళ్ళేటప్పుడు కవల పిల్లలు వెళుతుంటే ఆశక్తి చూస్తుంటాం. ఇద్దరు కవల పిల్లలను చూస్తేనే సంభ్రమాశ్చర్యంతో వారి దగ్గరకు వెళ్లి పలుకరించి వస్తుంటాం..లేకుంటే దూరం నుంచి చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటాం.. కానీ తిరుపతిలో ఒకేసారి 74మంది కవలలు ఒకే వేదికపైకి వచ్చారు. ఇది నిజం. నగరంలోని ఒక ప్రైవేటు స్కూలుకు చెందిన యాజమాన్యం 74మంది కవలలను ఒక వేదికపైకి తీసుకొచ్చింది. కవలల దినోత్సవం సంధర్భంగా ఈ అద్భుతమైన ఘట్టానికి తెరలేచింది.
ఎల్ కేజీ నుంచి 10వతరగతి వరకు విద్యార్థులందరూ ఇందులో కవలలుగా ఉన్నారు. ఒకే పాఠశాలలో ఇంతమంది కవలలు కలిసి చదువుకుంటుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కవలలను చూసేందుకు నగరంలోని ప్రజలందరూ భారీగా ప్రైవేటు పాఠశాలకు చేరుకున్నారు. మంగళం రోడ్డులో ఉన్న స్ప్రింగ్ డేల్ పబ్లిక్ స్కూల్లో కవలలు ఒకే వేదికపైన కనిపించారు.