తిరుపతిలో రిలయన్స్ ఎలక్ట్రానిక్ పార్క్ : ముఖేష్ - చంద్రబాబుల భేటీ వీడియో
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్నారు. ఇందుకోసం దేశ విదేశాల్లో తిరుగుతూ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ విజ్ఞప్తి చేస
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్నారు. ఇందుకోసం దేశ విదేశాల్లో తిరుగుతూ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆయన వినతి మేరకు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ముందుకు వచ్చారు. ఇందులోభాగంగా, ఆయన ఒక రోజు పర్యటన కోసం ఇటీవల విజయవాడకు కూడా వచ్చారు. ఈ సందర్భంగా ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ, చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ కేంద్రాన్ని సందర్శించిన ముఖేష్ అంబానీ ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అంబానీ ఇదివరకే చంద్రబాబు రాష్ట్రం గురించి వివరించినా పట్టించుకోలేదని, కానీ రియల్ టైం గవర్నెన్స్ (ఆర్టీజీ) చూసిన తర్వాత ఆశ్చర్యానికి లోనైనట్లు చెప్పారు. మాకంటే మీరే ఎంతో ముందున్నారు. మీతో కలిసి పనిచేసేందుకు మేం సిద్ధం. కలలు అందరూ కంటారు.. తానీ వాటిని సాకారం చేసుకునేవారు చాలా తక్కువ మందిమాత్రమే ఉంటారని అంబానీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తిరుపతిలో ఎలక్ట్రానిక్ పార్కు ఏర్పాటుకు ఆయన సూత్ర ప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. కాగా, చంద్రబాబు, ముఖేశ్ అంబానీలకు భేటీకి సంబంధించిన పూర్తి వీడియోను మీరూ ఓసారి తిలకించండి.